AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హుజూర్ నగర్ అభ్యర్థులకు ఈసీ షాక్ !

పార్టీల హడావిడితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులకు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పావులు […]

హుజూర్ నగర్ అభ్యర్థులకు ఈసీ షాక్ !
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 6:47 PM

Share

పార్టీల హడావిడితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులకు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. విజయమే పరమావధిగా డబ్బులు కుమ్మరిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం న్యూఢిల్లీ వెళ్ళి మరీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. దీని సారాంశమేంటంటే.. తెలంగాణలో అధికారంలో వున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అభియోగం.

లక్ష్మణ్ తోపాటు పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దరిమిలా సిఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకున్ని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1983 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి బిఆర్ బాలకృష్ణన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వ్యయపరిశీలకునిగా నియమించింది. అంతేకాదు ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు  సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. ఆయన స్థానంలో భాస్కరన్‌ను నియమించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని, సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలంటూ తెలంగాణ జనసమితి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈసీ సూర్యాపేట ఎస్పీని బదిలీ చేసింది.