ఎలాంటి అసంతృప్తి లేదు…హరీశ్‌రావు

తెలంగాణ మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఎలాంటి రాద్ధా౦తం చేయాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయ౦పై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని సూచించారు. తన పేరిట ఎలాంటి గ్రూపులు, సేనలు లేవని […]

ఎలాంటి అసంతృప్తి లేదు...హరీశ్‌రావు

Edited By:

Updated on: Mar 07, 2019 | 7:23 PM

తెలంగాణ మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఎలాంటి రాద్ధా౦తం చేయాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయ౦పై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని సూచించారు. తన పేరిట ఎలాంటి గ్రూపులు, సేనలు లేవని స్పష్టం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణగా మారుతోందన్నారు. కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను మంత్రులు పూర్తిస్థాయిలో నెరవేర్చి ప్రజల ఆకాంక్షలను తీర్చాలని సూచించారు.