మోడీకి భయపడొద్దు: మసూద్ అజహర్
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాస్ మసూద్ అజహర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఓ ఆడియో సందేశాన్ని పంపించాడు. అందులో మోడీకి భయపడొద్దని సూచించాడు. మోడీకి భయపడి తనపై చర్యలు తీసుకోవద్దంటూ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. భారత ప్రధాని బెదిరింపులకు పాక్ ప్రధాని సమాధానం చాలా పేలవంగా ఉందన్నాడు. ఆ సమాధానం భయపడినట్టు ఉందని, తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పాడు. పుల్వామా […]
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాస్ మసూద్ అజహర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఓ ఆడియో సందేశాన్ని పంపించాడు. అందులో మోడీకి భయపడొద్దని సూచించాడు. మోడీకి భయపడి తనపై చర్యలు తీసుకోవద్దంటూ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. భారత ప్రధాని బెదిరింపులకు పాక్ ప్రధాని సమాధానం చాలా పేలవంగా ఉందన్నాడు. ఆ సమాధానం భయపడినట్టు ఉందని, తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పాడు.
పుల్వామా దాడి అంశం రాబోయే ఎన్నికల్లో మోడీకి మంచి ఫలితాలను ఇస్తుందంటూ పాక్ మీడియాలో వచ్చిన విశ్లేషణలపై మసూద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఉగ్రవాదంపై మోడీ ప్రభుత్వం చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయనే వాదన తప్పని తేలినట్టు అభిప్రాయపడ్డాడు. మసూద్ ఈ విధంగా పాక్ ప్రధానికి సందేశం పంపడంతో అతను భయపడుతున్నట్టు అర్ధం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే పాక్ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడని, తనపై చర్యలు తీసుకుంటారేమోనని భయపడుతున్నాడని అంటున్నారు.