ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. హోదా ఇస్తానని ఆనాడు మోడీ చెప్పిన వేదికపైనే రాహుల్ ఈ విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది. ప్రధాని అంటే దేశ ప్రజలకు ప్రతినిధి అని, కానీ దేశ ప్రజల తరపున ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని మోడీ తుంగలో తొక్కారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే […]

ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 23, 2019 | 7:31 AM

తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. హోదా ఇస్తానని ఆనాడు మోడీ చెప్పిన వేదికపైనే రాహుల్ ఈ విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది. ప్రధాని అంటే దేశ ప్రజలకు ప్రతినిధి అని, కానీ దేశ ప్రజల తరపున ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని మోడీ తుంగలో తొక్కారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్.