తమిళనాడులో మరోసారి పంజా విరుసుతున్న కరోనా.. 15 మంది రైల్వే గ్యారేజ్‌ సిబ్బందికి పాజిటివ్

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 9:05 am, Wed, 7 April 21
తమిళనాడులో మరోసారి పంజా విరుసుతున్న కరోనా.. 15 మంది  రైల్వే గ్యారేజ్‌ సిబ్బందికి పాజిటివ్
Coronavirus

railway employee coronavirus: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా తమిళనాడులోని రైల్వే గ్యారేజ్‌లో పని చేస్తున్న 15 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు.

స్థానిక రాయపురంలోని రైల్వే గ్యారేజ్‌లో వందకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల ఓ ఉద్యోగి జ్వరం, దగ్గు లక్షణాలకు గురికాగా, అతని నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం గ్యారేజ్‌లోని 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌‌గా తేలింది. దీంతో, వారందరిని హోం క్వారంటైన్‌లో వుండాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసు నమోదవుతున్న మహారాష్ట్రలోని పలు జిల్లాలు, నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు అమలవుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. మధ్యప్రదేశ్‌లోని చిండ్వారా సహా నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. అటు, పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ వరకు తరగతులను నిర్వహించకూడని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read…..  దండకారణ్యంలో రక్తపాతం… ఇంకా మావోల చెరలోనే జవాన్ రాకేశ్వర్ సింగ్.. మావోయిస్ట్ లేఖలో మర్మమేంటీ..?