AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: లండన్ వర్సిటీలో కరోనా… చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి మానవాళి మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ 118 దేశాలకు విస్తరించింది. లక్షా 25 వేల మందికి సోకింది. భారత్ సహా పలు దేశాల్లో ఎపిడమిక్ వైరస్‌గా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి.

Big Breaking: లండన్ వర్సిటీలో కరోనా... చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
Rajesh Sharma
|

Updated on: Mar 13, 2020 | 12:42 PM

Share

So many telugu students struck in Covit-19 effected London university: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి మానవాళి మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ 118 దేశాలకు విస్తరించింది. లక్షా 25 వేల మందికి సోకింది. భారత్ సహా పలు దేశాల్లో ఎపిడమిక్ వైరస్‌గా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. విదేశాలకు అత్యంత అవసరం అయితే తప్ప వెళ్ళ వద్దని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విదేశాలల్లో వున్న భారతీయులంతా భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా లండన్ హెర్ట్‌ఫర్డ్ షైర్ యూనివర్సిటీలో 1600 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్న ఉదంతం వెలుగు చూసింది. ఈ యూనివర్సిటీలో ఇప్పటికే పలువురు విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినందున అక్కడి తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. లండన్ నగరంలో వున్న హెర్ట్‌ఫర్డ్ షైర్ వర్సిటీ డి హెవిలాండ్ క్యాంపస్‌లో కరోనా విస్తరించింది. ప్రస్తుతం యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో 17 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వర్సిటీ పరిధిలోను ఒక పాజిటివ్ కేసు నమోదైంది.

ఇంత మందికి పాజిటివ్ వైరస్ కనిపిస్తున్నా.. యూనివర్సిటీ అధికారులు తరగతులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో భయాందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థికి రూమ్‌లోనే ట్రీట్ మెంట్ ఇస్తున్నారు వైద్యులు. అయితే.. పాజిటివ్ కేసుల నేపథ్యంలోనూ వర్సిటీలో క్లాసుల కొనసాగింపుపై విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. వైరస్ అటాక్ అవుతుందనే భయాందోళనతో తెలుగు విద్యార్థులు భీతిల్లుతున్నారు. క్లాసులు యధావిధిగా కొనసాగిస్తునట్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కాలేజి అధికారులు వెల్లడించారు. తమకు భారత్‌కు తీసుకువచ్చేందుకు తెలుగు ప్రభుత్వాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.