కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు సీలు.. పోలీసు కేసు

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్  మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు...

కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు సీలు.. పోలీసు కేసు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 31, 2020 | 12:15 PM

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్  మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు, ఒకరు జమ్మూకాశ్మీర్ కు చెందినవారు. ఈ మసీదును సీల్ చేయాలని, నిర్వాహకులపై కేసు పెట్టాలని కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మతపర కార్యక్రమాలకు హాజరైనవారిలో అనేక దేశాలకు చెందిన సుమారు 1200 మందికి పైగా ఉన్నారు. వీరిలో దాదాపు రెండు వందలమందిని నిన్న వివిధ బస్సుల్లో ఢిల్లీ నగరంలోని వేర్వేరు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇండోనేషియాకు చెందిన కొందరు తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లారని ఒక అధికారి తెలిపారు. ఒక రోగి హైదరాబాద్ లోను, మరొకరు శ్రీనగర్ లోను మృతి చెందినట్టు తెలియగానే అన్ని రాష్ట్రాలకు ఎస్ ఓ ఎస్  మెసేజులు పంపినట్టు ఆయన చెప్పారు. కాగా మర్కజ్ నిజాముద్దీన్ మసీదు నిర్వాహకులు తమ చర్యను సమర్థించుకున్నారు. మార్చి 22 న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూను ప్రకటించగానే తమ కార్యక్రమాన్ని రద్దు చేశామని, అయితే మార్చి 24 న అన్ని బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా మసీదులోనే చిక్కుబడిపోయారని వారు వివరించారు.