BREAKING: తెలుగు రాష్ట్రాలకు ముప్పు… మరో రెండ్రోజులు గడిస్తే చాలు !!

ఆంధ్ర ప్రదేశ్ కోస్తా తీరానికి పెను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉండనుండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు వాతావరణ శాఖాధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం…! బంగాళాఖాతంలో ఎల్లుండి లోగా ఏర్పడనున్న అల్పపీడనం బలంగా ఉండడమే కాకుండా దానికి చురుకుగా ఉన్న రుతుపవనాలు జత కలవడం తో కోస్త ఆంధ్ర ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఈ […]

BREAKING: తెలుగు రాష్ట్రాలకు ముప్పు... మరో రెండ్రోజులు గడిస్తే చాలు !!
Follow us

|

Updated on: Sep 19, 2019 | 8:01 PM

ఆంధ్ర ప్రదేశ్ కోస్తా తీరానికి పెను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉండనుండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు వాతావరణ శాఖాధికారులు.

బంగాళాఖాతంలో అల్పపీడనం…!

బంగాళాఖాతంలో ఎల్లుండి లోగా ఏర్పడనున్న అల్పపీడనం బలంగా ఉండడమే కాకుండా దానికి చురుకుగా ఉన్న రుతుపవనాలు జత కలవడం తో కోస్త ఆంధ్ర ప్రాంతంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని మెట్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా, గోదావరి నదులకు మళ్లీ భారీ వరద ప్రమాద సూచనలున్నాయని అంటున్నారు. ఈ నెల 21 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా varada వచ్చే అవకాశాలున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష.. పడుగుపాటు హెచ్చరికలు

హైదరాబాద్, శంషాబాద్, మెదక్, కామారెడ్డి, నల్గొండ, యాదాద్రి.. భవనగరి ప్రాంతాలలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ మెట్ అధికారులు వెల్లడించారు. 22 వ తేదీన భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగం. ఇప్పటికే వాట్సాప్ గ్రూపులు.. ఫోన్ వాయిస్ ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Latest Articles