AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు బిగ్ షాక్.. షాపులు బంద్

ఏపీలో మందుబాబులకు, లిక్కర్ ప్రియులకు పెద్ద షాకిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మద్యం షాపులను మూసి వేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిందే తడవుగా రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మద్యం షాపులను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మందుబాబులకు బిగ్ షాక్.. షాపులు బంద్
Rajesh Sharma
|

Updated on: May 09, 2020 | 4:00 PM

Share

ఏపీలో మందుబాబులకు, లిక్కర్ ప్రియులకు పెద్ద షాకిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని మద్యం షాపులను మూసి వేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చిందే తడవుగా రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు మద్యం షాపులను మూసి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఏపీలో మద్యం షాపులు మూతపడనున్నాయి.

ఏపీలో మరో 13 శాతం మద్యం షాపులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తొలగించిన 20 శాతంతో కలిపి మొత్తం 33 శాతం మద్యం దుకాణాలు తొలగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 4380 షాపులకుగాను ప్రస్తుతం అందుబాటులో 3469 షాపులున్నాయి. ఈ సంఖ్యను 2934 కు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మే నెల ఆఖరు నాటికి ఈ 13 శాతం మద్యం షాపులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుండి మార్చి నాటికి రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ 24 శాతం, బీరు అమ్మకాలు 55 శాతం తగ్గినట్టు ప్రభుత్వం అంఛనా వేస్తోంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు మరింతగా తగ్గుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలిన తరుణంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతించడంపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే
సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!
సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!
మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?
సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్
హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్