ఇసుక కొరతకు ఏపీ సర్కార్ చెక్..ఎలాగంటే..?

గత కొన్ని రోజులుగా ఏపీలో ఇసుక పాలిటిక్స్ నడుస్తున్నాడు. ప్రభుత్వం ఇసుకను సరఫరా చేయడంలో విఫలమయ్యిందని..అందుకే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహ్యలు చేసుకుంటున్నారంటూ విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదుర్కొన్న మేజర్ సమస్య కూడా ఇదే. దీంతో ఇసుక కొరతను అధిగమించేందుకు సీఎం బ్యాక్ టూ బ్యాక్ అధికారులు, మంత్రులతో భేటీ అయ్యారు. ఎటువంటి చర్చలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరిపి..ఇసుక వారోత్సవాలకు షెడ్యూల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు […]

ఇసుక కొరతకు ఏపీ సర్కార్ చెక్..ఎలాగంటే..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 09, 2019 | 5:47 AM

గత కొన్ని రోజులుగా ఏపీలో ఇసుక పాలిటిక్స్ నడుస్తున్నాడు. ప్రభుత్వం ఇసుకను సరఫరా చేయడంలో విఫలమయ్యిందని..అందుకే భవన నిర్మాణ కార్మికులు ఆత్మహ్యలు చేసుకుంటున్నారంటూ విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదుర్కొన్న మేజర్ సమస్య కూడా ఇదే. దీంతో ఇసుక కొరతను అధిగమించేందుకు సీఎం బ్యాక్ టూ బ్యాక్ అధికారులు, మంత్రులతో భేటీ అయ్యారు. ఎటువంటి చర్చలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరిపి..ఇసుక వారోత్సవాలకు షెడ్యూల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లు ఇసుకు తవ్వేందుకు ఉన్న ప్రధాన సమస్య వరదలు. మన దగ్గర వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి కూాడా భారీగా వరదనీరు ప్లో ఉండటంతో తవ్వకాలకు అడ్డంకి ఏర్పడింది. ప్రస్తుతం వరద తాకిడి చాలా వరకు తగ్గిపోవడంతో ఇసుక తవ్వకాలను ప్రారంభించినట్టు ఏపీ ప్రభుత్వం నుంచి వినిపిస్తోన్న మాట. దీంతో ఇసుక కొరత కూడా కొంతమేర అధిగమించమని… గత వారం రోజుల వ్యవధిలోనే సరఫరా దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. నవంబరు 1 న 31,576 టన్నుల సరఫరా వుండగా నవంబరు 7 నాటికి 86,482 టన్నులకు పెరిగిందని వివరించాడు. మరో రెండు రోజుల వ్యవధిలోని ఈ సరఫరా లక్ష టన్నులను చేరుకోనుందని అధికార వర్గాల భోగట్టా.  నదుల నుండి మొదటి ఆర్డ్‌ర్, రెండో ఆర్డర్, మూడో ఆర్డర్‌ కింద ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. వరుస స్ట్రీమ్స్‌లో 300 పైగా రీచ్‌లు గుర్తించినట్లు…నదుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నకొద్ది మరిన్ని ఎక్కువ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.

కాగా వచ్చే వారం స్పందన నాటికి ఇసుక తాాజా రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలని సీఎం ఆదేశించారు. వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహించనున్నట్టు సమాచారం. అప్పుడే ఇసుక వారోత్సవాల తేధీలను ప్రకటించనున్నారు. ఇసుక విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.