AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశాన్ని కాపాడే సత్తా ఉన్న నాయకుడు మోదీనే : అమిత్ షా

నిజామాబాద్దే : దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. నిజామాబాద్‌లో జరిగిన బిజెపి బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని, దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ అని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, ఏడాదికి రూ.6 వేలు […]

దేశాన్ని కాపాడే సత్తా ఉన్న నాయకుడు మోదీనే : అమిత్ షా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 9:37 PM

Share

నిజామాబాద్దే : దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. నిజామాబాద్‌లో జరిగిన బిజెపి బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని, దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ అని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, ఏడాదికి రూ.6 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచామని, దేశాన్ని రక్షించే సత్తా ఉన్న నాయకుడు మోదీ అని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతిఒక్కరూ శ్రమించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసమే కాదు, భారత దేశం కోసమూ గెలవాలని అమిత్ షా భావోద్వేగ ప్రసంగం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అసోం నుంచి గుజరాత్ వరకు గెలుపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పాక్ పై భారత వైమానిక దాడుల గురించి అమిత్ షా ప్రసంగించారు. దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇచ్చామని, పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు లేరని, రాహుల్ బాబా నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోందని, ఎన్నికలకు వెళ్లేందుకు ఆ పార్టీకి ఒక అజెండా లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందేమీ లేదని, దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. కాగా అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న అమిత్ షాకు టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు ఘనస్వాగతం పలికారు.

Follow Us
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌తో రానున్న రామ్ పోతినేని
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
గ్యాస్ కస్టమర్లకు లాస్ట్ ఛాన్స్.. వెంటనే ఈ పని పూర్తి చేయకపోతే..
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
అరటి ఆకుపై గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షాకింగ్ సీక్రెట్
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
బోటి కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. స్మెల్ రాదు..
ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి ..
ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి ..
తులం బంగారం రూ.3 లక్షలకు చేరుతుందా? ధరల పెరుగుదల వెనుక అసలు ఇవే!
తులం బంగారం రూ.3 లక్షలకు చేరుతుందా? ధరల పెరుగుదల వెనుక అసలు ఇవే!
పసిప్రాణంపై ప్రయోగం.. చిన్నారి కంటిచూపు మాయం!
పసిప్రాణంపై ప్రయోగం.. చిన్నారి కంటిచూపు మాయం!