రెండో సారి రైల్వే, విమానయాన శాఖలకు ఈసీ నోటీసులు

న్యూఢిల్లీ : రైల్వేతో పాటు, పౌర విమానయాన శాఖలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఇవాళ నోటీసులు జారీ చేసింది. రెండు శాఖలకు సంబంధించిన టికెట్లపై ప్రధాని మోదీ బోమ్మను ముద్రించిన అంశాన్ని ఈసీ నోటీసులో ప్రస్తావించింది. రైల్వే, విమాన‌యాన శాఖ‌ల‌కు ఈసీ నోటీసులు ఇవ్వ‌డం ఇది రెండ‌వ‌సారి. మూడు రోజుల క్రితం మొద‌టిసారి ఆ రెండు శాఖ‌ల‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆ శాఖ‌ల నుంచి స్పంద‌న రాలేదు. మదురై విమ‌నాశ్ర‌యంలో బోర్డింగ్ పాసుల‌పై […]

రెండో సారి రైల్వే, విమానయాన శాఖలకు ఈసీ నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 30, 2019 | 8:26 PM

న్యూఢిల్లీ : రైల్వేతో పాటు, పౌర విమానయాన శాఖలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఇవాళ నోటీసులు జారీ చేసింది. రెండు శాఖలకు సంబంధించిన టికెట్లపై ప్రధాని మోదీ బోమ్మను ముద్రించిన అంశాన్ని ఈసీ నోటీసులో ప్రస్తావించింది. రైల్వే, విమాన‌యాన శాఖ‌ల‌కు ఈసీ నోటీసులు ఇవ్వ‌డం ఇది రెండ‌వ‌సారి. మూడు రోజుల క్రితం మొద‌టిసారి ఆ రెండు శాఖ‌ల‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆ శాఖ‌ల నుంచి స్పంద‌న రాలేదు. మదురై విమ‌నాశ్ర‌యంలో బోర్డింగ్ పాసుల‌పై మోదీ ఫోటోలు ఉన్నాయి. దానిపై వివరణ ఇవ్వాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మోదీ బొమ్మలను ముద్రించిన రైలు టిక్కెట్లు, ఎయిరిండియా బోర్డింగ్ పాస్‌లను ఉపయోగించడంపై వివరణ ఇవ్వాలని కోరింది.

రైలు, ఎయిరిండియా బోర్డింగ్ పాస్ లపై ప్రధాని మోడీ ఫొటో ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఎంసీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కాగా, ప్రధాని మోదీతోపాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఫొటోలను ముద్రించిన బోర్డింగ్ పాస్‌లను ఎయిరిండియా ఉపసంహరించాలని ఈ నెల 25న నిర్ణయించింది. రైలు టిక్కెట్లపై ఓ వైపు ప్రధాని మోదీ ఫొటోతోపాటు ప్రభుత్వ ప్రకటనను ముద్రించడంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం రైల్వేలను ఈ నెల 27న వివరణ కోరింది. అలాగే మై భీ చౌకీదార్ అని ముద్రించి ఉన్న టీ కప్పులతో రైలు ప్రయాణికులకు టీని ఇవ్వడంపై శుక్రవారం అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించి, ఆ టీ కప్పులను ఉపసంహరించడంతోపాటు కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు.