“ఒకటి, రెండు స్కిట్‌లు కొట్టి ఆదిపైనే పంచా…”

తెలుగు బుల్లి తెరపై కామెడీ షోల హంగామా కొనసాగుతోంది. ఎవరగ్రీన్‌ ‘జబర్దస్త్‌’కు పోటీగా ఇటీవలే ‘అదిరింది’ షో వచ్చిన సంగతి తెలిసిందే. జడ్జి నాగబాబుతో పాటు  చాలామంది కమెడియన్స్ ‘జబర్దస్త్‌’ నుంచి అక్కడికి షిప్ట్ అయ్యారు. పైసాతో నడిచే ప్రస్తుత ప్రపంచంలో ఎవరికి నచ్చిన చోటికి వారు షిప్ట్ అవ్వొచ్చు. అది పక్కనబెడితే రేటింగ్స్ పరంగా ‘జబర్దస్త్‌’ను అందుకోలేకపోతుంది ‘అదిరింది’. యాంకర్‌ని మార్చినా, పాత పంచ్‌లను తిప్పి, తిప్పి వేస్తోన్న ఫలితం ఉండటం లేదు. ఒక్క సద్దాం […]

ఒకటి, రెండు స్కిట్‌లు కొట్టి ఆదిపైనే పంచా...
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2020 | 10:20 PM

తెలుగు బుల్లి తెరపై కామెడీ షోల హంగామా కొనసాగుతోంది. ఎవరగ్రీన్‌ ‘జబర్దస్త్‌’కు పోటీగా ఇటీవలే ‘అదిరింది’ షో వచ్చిన సంగతి తెలిసిందే. జడ్జి నాగబాబుతో పాటు  చాలామంది కమెడియన్స్ ‘జబర్దస్త్‌’ నుంచి అక్కడికి షిప్ట్ అయ్యారు. పైసాతో నడిచే ప్రస్తుత ప్రపంచంలో ఎవరికి నచ్చిన చోటికి వారు షిప్ట్ అవ్వొచ్చు. అది పక్కనబెడితే రేటింగ్స్ పరంగా ‘జబర్దస్త్‌’ను అందుకోలేకపోతుంది ‘అదిరింది’. యాంకర్‌ని మార్చినా, పాత పంచ్‌లను తిప్పి, తిప్పి వేస్తోన్న ఫలితం ఉండటం లేదు. ఒక్క సద్దాం స్కిట్ మాత్రమే ‘అదిరింది’ షోలో అంతో ఇంతో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అతడి స్కిట్స్ రెండు, మూడు ఇటీవల యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సంపాదించుకున్నాడు. కొత్త కుర్రోడు ఎదుగుతున్నాడు సంతోషకరమే.

కానీ ‘అదిరింది’ షో ప్రారంభ ప్రోమోల నుంచి జబర్దస్త్‌పై సెటిర్స్ వేస్తూనే ఉన్నారు. బజ్ తెచ్చుకోడానికి భారీ స్థాయిలో అదుపుతప్పారు. ‘జబర్దస్త్‌’ జడ్జ్  రోజాతో పాటు మెన్నామధ్య గెస్ట్ జడ్జ్‌గా విచ్చేసిన ఆలీపైనా పంచ్‌లు పేల్చారు. తాజాగా స్కిట్స్‌లో కూడా భారీ స్థాయిలోనే ‘జబర్దస్త్‌’పై పంచులు వేస్తున్నారు అదిరింది కమెడియన్లు.  ఇటీవల గల్లీ బాయ్స్ స్కిట్‌లో భాస్కర్… ”అది కాదురా..” అనగానే…”ఆది కాకుంటే… సద్దాం.. ట్రెండింగ్‌లో ఉంటుంది” అని తన రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేశాడు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది నిజమే. కానీ ఆది ఇంకా ఔట్‌డేట్ అవ్వలేదు. అదే ఎనర్టీ, అదే టైమింగ్‌తో దుమ్ము రేపుతున్నాడు. తన స్కిట్స్‌ను యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంచుకోవడం అతడికి అలవాటుగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఆదికి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి అంటే..ఆశ్యర్యం కలగకమానదు. అలాంటి వ్యక్తిపై ఒకటి, రెండు స్కిట్‌లు కొట్టి సద్దాం పంచ్‌వేసి అతి చేస్తున్నాడనే అపవాదును మూటగట్టుకున్నాడని బుల్లితెర ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. “ఫేమ్ టాలెంట్‌ని బట్టి వస్తుంది…గౌరవం మాత్రం మన పద్దతికి వస్తుంది”. “ఎదగండి బ్రదర్…ఎగరొద్దు”..అని చురకలు కూడా అంటిస్తున్నారు.

ఇది కూాడా చదవండి : శోభనానికి ముందు భర్త ఫోన్‌కు భార్య పోర్న్ వీడియో..