AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబూ అప్పటి మ్యాజిక్ మిస్సవుతోంది..

టీడీపీ అధినేత చంద్రబాబు డిఫెన్స్‌‌లో పడ్డారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 ఏళ్లు  దేశ రాజకీయాల్లో చక్రం తప్పిన నేతగా చంద్రబాబు అనుభవం, రాజకీయ చతురత ఎవ్వరూ కాదనలేనిది. కానీ ఎందుకో 2019 ఎన్నికల అనంతరం టీడీపీ అధినేతలో జోష్ తగ్గింది. పార్టీ హిస్టరీలో ఎన్నడూ ఊహించని ఓటమిని ఫేస్ చేసిన చంద్రబాబు, డిఫీట్‌ని పర్సనల్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. పార్టీలో నాయకులు ఒకరి వెంట ఒకరు ఝలక్ ఇస్తూ ఉండటం, అటు కేంద్రంలో ఫామ్‌లో […]

బాబూ అప్పటి మ్యాజిక్ మిస్సవుతోంది..
Ram Naramaneni
|

Updated on: Dec 11, 2019 | 1:43 PM

Share

టీడీపీ అధినేత చంద్రబాబు డిఫెన్స్‌‌లో పడ్డారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 ఏళ్లు  దేశ రాజకీయాల్లో చక్రం తప్పిన నేతగా చంద్రబాబు అనుభవం, రాజకీయ చతురత ఎవ్వరూ కాదనలేనిది. కానీ ఎందుకో 2019 ఎన్నికల అనంతరం టీడీపీ అధినేతలో జోష్ తగ్గింది. పార్టీ హిస్టరీలో ఎన్నడూ ఊహించని ఓటమిని ఫేస్ చేసిన చంద్రబాబు, డిఫీట్‌ని పర్సనల్‌గా తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. పార్టీలో నాయకులు ఒకరి వెంట ఒకరు ఝలక్ ఇస్తూ ఉండటం, అటు కేంద్రంలో ఫామ్‌లో ఉన్న బీజేపీపై మొన్నటివరకు వైరం పెట్టుకోవడంతో…ఎప్పుడూ సెంటర్ ఆఫ్ పాలిటిక్స్‌గా ఉండే చంద్రబాబు..ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక సెంటర్‌లో నిలబడిపోయారు.

మరోవైపు లోకేశ్‌ను లీడర్‌గా ప్రొజెక్ట్ చేసేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు.  అది కూడా అంత సవ్యంగా సాగడం లేదు. తెలుగుదేశం పార్టీలోని లొసుగులు బయటకు స్పష్టంగా కనిపిస్తోన్నా..బాబు నర్మగర్భంగా బెదిరేది లేదు, భయపడేది లేదు అంటూ పొడి మాటలు మాట్లాడుతున్నారు. ఆ గేమ్ ప్లాన్ ఏది, ఆ చాణుక్యం ఏది..ఆ మాటకారితనం ఏది..ఇది అసెంబ్లీలో టీడీపీ అధినేతను గమనిస్తున్న చాలామంది ప్రశ్నిస్తోన్న మాట. ఒకప్పుడు చంద్రబాబు మాట్లాడితే..ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఎదురుగా ఉన్న సభ్యులు నీళ్లు నమిలేవారు. కానీ ప్రస్తుతం తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు సైతం…ఆయనతో బిగ్ బాస్ టాస్కులు ఆడిస్తున్నారు.

ఇదంతా పక్కనపెడితే, ఆయన పార్టీ నుంచి గతంలో బయటకు వచ్చి  వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్‌గా ఉన్న కొడాలి నాని, ఇటీవలే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ..చంద్రబాబుని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఆయన అవకాశవాది, అధికారం కోసం ఏమైనా చేస్తాడంటూ విరుచుకుపడుతున్నారు. కొన్ని వ్యాఖ్యలు అయితే చర్చించడానికి వీలుకావడం లేదు. ఒక్కసారి జగన్ యస్ అన్నా, బీజేపీ భరోసా ఇచ్చినా..బాబు ప్రతిపక్ష హోదా హుష్ కాకి అవుతుందన్నది అందరికి విదితమైన విషయమే. ఈ క్రమంలో బాబు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది. ఇంతమంది ప్రత్యర్థులను ఆయన ఎలా ఎదుర్కొగల్గుతారు..? వచ్చే ఎన్నికల నాటికి లోకేశ్‌ని రాటుదేల్చగల్గుతారా అన్న పశ్నలకు కాలమే సమాధానం చెప్పనుంది.