Bigg Boss 4 : బిగ్ బాస్ షో పై వరుణ్‌‌‌‌‌‌‌‌సందేశ్ భార్య సంచలన కామెంట్లు.. వాళ్ళు అదే చూపిస్తారు నమ్మకండి అంటూ..

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఐదుగురు టాప్ 5కిచేరుకున్నారు. బిగ్ బాస్ షో మాత్రం మరో వారం రోజుల్లో నాలుగో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోబోతుంది. అందరు అనుకున్నట్టుగానే మోనాల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 4 : బిగ్ బాస్ షో పై వరుణ్‌‌‌‌‌‌‌‌సందేశ్ భార్య సంచలన కామెంట్లు.. వాళ్ళు అదే చూపిస్తారు నమ్మకండి అంటూ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 14, 2020 | 4:38 PM

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఐదుగురు టాప్ 5కి చేరుకున్నారు. బిగ్ బాస్ షో మరో వారం రోజుల్లో నాలుగో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోబోతుంది. అందరు అనుకున్నట్టుగానే మోనాల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక మిగిలిన వారిలో అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక ఫినాలేలోకి అడుగుపెట్టారు. వీరిలో విజేత ఎవరన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 20న జరిగే గ్రాండ్ ఫినాలే లో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.

ఇలాంటి సమయంలో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ వితిక షేరు బిగ్ బాస్ షో పై సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ చరిత్రలో భార్య భర్తలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది లేదు.  కానీ తెలుగు బిగ్ బాస్ లో ఆ రికార్డు సొంతం చేసుకుంది వరుణ్ సందేశ్, వితిక జంట. ఆ సీజన్ కి ఈ ఇద్దరు హైలెట్ గా నిలిచారు. హౌస్ లో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ.. మధ్య మధ్యలో ముద్దులు హగ్గులతో హడావిడి చేశారు. ఇక షోలో జెంటిల్ మెన్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ సందేశ్ తనదైన ఆటతో సీజన్ 3లో ఫినాలే వరకు వెళ్ళాడు. ఫినాలే ముందు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక వితిక సీజన్ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్బంగా ఆమెకు బిగ్ బాస్ కు సంబందించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో బిగ్ బాస్ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చింది వితిక. నాలుగో సీజన్ విన్నర్ ఎవరు అవుతారంటూ కొందరు.. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటూ మరికొందరు ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోపై వితిక షేరు సంచలన కామెంట్లు చేసింది. బిగ్ బాస్ షోలో చూపించేవి నమ్మకండి. షోలు చాలా జారుతాయి కానీ ఎడిటర్ల మాత్రం వాళ్లకు నచ్చిన కంటెంట్‌నే ఎక్కువగా చూపిస్తారు. దీని వల్ల ఒరిజినల్ క్యారెక్టర్లు బయట పడవు. కాబట్టి.. మీకు బాగా నచ్చిన, తెలిసిన కంటెస్టెంట్‌కే ఓట్లు వేయండి. నాకు తెలిసిన వాళ్ల కే నేను ఓట్లు వేస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చింది వితిక. ఇప్పుడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త