Bigg Boss 4: అనారోగ్యానికి గురైన మోనాల్.. తెగ ఫీల్ అయిన అఖిల్
బిగ్‌బాస్ హౌజ్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది.
Monal Akhil romance: బిగ్‌బాస్ హౌజ్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది. అయితే ఇంటి సభ్యులంతా ఈ కేక్ కటింగ్‌కి వచ్చినా అఖిల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. మోనాల్ కూడా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.
ఇదిలా ఉంటే మరోవైపు మోనాల్‌కి హెల్త్ బాలేదని, సెలైన్లు ఎక్కించినట్లు బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఉదయాన్నే మోనాల్ దగ్గరకు వెళ్లాడు అఖిల్. ఆమె చేతికి ఉన్న సూదిని చూసి తెగ ఫీల్ అయ్యాడు. ఇక మోనాల్ ఎప్పటిలాగే అఖిల్‌ని తనవైపుకు లాక్కొని గట్టి హగ్ ఇచ్చింది. అయితే గత వారం నామినేషన్ సమయంలో ఇదంతా నేషనల్ టెలివిజన్‌లో టెలికాస్ట్ అవుతుంది, నా కారెక్టర్‌ని బ్యాడ్ చేయకండి, నా పరువు తీయకండి అని వ్యాఖ్యలు చేసిన మోనాల్.. అఖిల్‌తో మాత్రం రొమాన్స్ ఆపడం లేదు.
Read More:
Bigg Boss 4: అరియానా vs సొహైల్.. రచ్చ రచ్చ
Breaking: కారు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు గాయాలు