సమంత టాక్ షో ‘సామ్ జామ్’ నుంచి ఇన్విటేషన్ అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. అతను ఎవరంటే…

అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం టాక్ షోలతో వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్న  విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవరిస్తుంది.

సమంత టాక్ షో 'సామ్ జామ్' నుంచి ఇన్విటేషన్ అందుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. అతను ఎవరంటే...
దాంతో పెళ్లి తర్వాత సమంత స్పీడ్ తగ్గించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 
Rajeev Rayala

|

Dec 20, 2020 | 5:42 PM

అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం టాక్‌‌‌‌‌షోలతో, వెబ్ సిరీస్‌‌‌లతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్‌‌‌షోకు హోస్ట్‌‌‌గా వ్యవరిస్తుంది. సామ్ జామ్ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు స్టార్స్  పాల్గొన్నారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్‌‌‌కు హాజరుకానున్నారు. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ షోకి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ లిస్ట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ అభిజీత్ కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్4 లో హౌస్‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్4 కు అభిజీత్ ను విన్నర్‌‌‌‌ను చేయాలని అతని అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిజీత్‌‌‌‌‌కు సామ్ జామ్ నుంచి ఆహ్వానం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ కారణంగా అతడికి పెరిగిన ఇమేజ్,  బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ రేసులో అతడు ఉండటంతో అభిజీత్‌‌‌‌‌‌‌కు ఇప్పటికే సామ్ జామ్ నుంచి ఇన్విటేషన్ అందిందని అంటున్నారు. ఇక అభిజీత్‌‌‌తో సినిమా చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu