శ్రీముఖికి షాక్.. ‘బిగ్ బాస్’ సీరియస్!

‘బిగ్ బాస్’ షో వారానికి ఓ ట్విస్ట్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడో వారం అయితే హాట్ హాట్‌గా సాగుతోంది. టాస్క్‌లు, గేమ్స్‌తో హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య ప్రతిసారి వాగ్వాదం చోటు చేసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకు కూడా వారు గొడవలకు దిగుతూ హౌస్‌లో కాకపుట్టిస్తున్నారు. ఇక మొదటి వారం హౌస్ నుంచి నటి హేమ ఎలిమినేట్ కాగా.. రెండోవారం టీవీ9 జాఫర్ వైదొలిగారు. ఇప్పుడు మూడో వారంలో ట్రాన్స్ జెండర్ తమన్నా – పునర్నవి – రాహుల్ […]

శ్రీముఖికి షాక్.. 'బిగ్ బాస్' సీరియస్!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 09, 2019 | 5:17 PM

‘బిగ్ బాస్’ షో వారానికి ఓ ట్విస్ట్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మూడో వారం అయితే హాట్ హాట్‌గా సాగుతోంది. టాస్క్‌లు, గేమ్స్‌తో హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య ప్రతిసారి వాగ్వాదం చోటు చేసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకు కూడా వారు గొడవలకు దిగుతూ హౌస్‌లో కాకపుట్టిస్తున్నారు.

ఇక మొదటి వారం హౌస్ నుంచి నటి హేమ ఎలిమినేట్ కాగా.. రెండోవారం టీవీ9 జాఫర్ వైదొలిగారు. ఇప్పుడు మూడో వారంలో ట్రాన్స్ జెండర్ తమన్నా – పునర్నవి – రాహుల్ – బాబా మాస్టర్ – వితికలు ఎలిమినేషన్‌లో ఉన్నారు. అటు గురువారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌కు కంటెస్టెంట్లందరూ శారీరికంగా దాడి చేసుకునే వరకు వెళ్లారు. గాజు పెట్టెలోని డబ్బులను కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్‌తో వచ్చి గాజు గ్లాస్‌ను పగలకొట్టడం.. ఆ అద్దాలు కాస్తా రవికృష్ణ చేతికి తగిలి రక్తం కారడంతో మిగిలిన కంటెస్టెంట్లు శ్రీముఖిని తిట్టిపోశారు.

మరోవైపు హౌస్‌లోని వస్తువును శ్రీముఖి పగలకొట్టడంతో.. బిగ్ బాస్ ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నాడు. దీనికి శిక్షగా ఆమెను వచ్చేవారం ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ చేశాడు. ఇక పునర్నవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.. దీనిలో సక్సెస్ అయితే మీరు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారని మెలిక పెట్టాడు.