సాగుకు భరోసా ఎంత? కూలీలకు ఇచ్చిందెంత?

ప్యాకేజీపై భిన్నస్వరాలు రైతులకు నేరుగా ఎలాంటి ప్రయోజనం లేదు వడ్డీ రాయితీలకు కండీషన్స్‌ అప్లై వసలకూలీలకు సంక్షేమం అందేనా! రైతుకు భరోసా, పేదలకు ఉపాధి, వలస కూలీలకు తిండిగింజలు, చిన్నవ్యాపారులకు పెద్దపీట, అసంఘటిత శక్తికి తీపి కబురు… ఓవరాల్‌గా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి గంటన్నర పాటు ఇవే మాట్లాడారు. దేశ నిర్మాణంలో పైకి కనిపించని పునాది లాంటి ఈ వర్గాలకే ప్యాకేజ్ ప్రకటించారు. వలసకూలీలను కేంద్రం సకాలంలో ఆదుకోలేకపోయిందన్న విమర్శలకు చెక్‌గా వన్ నేషన్‌.. వన్‌ రేషన్‌ను […]

సాగుకు భరోసా ఎంత? కూలీలకు ఇచ్చిందెంత?
Follow us

|

Updated on: May 15, 2020 | 3:19 PM

  • ప్యాకేజీపై భిన్నస్వరాలు
  • రైతులకు నేరుగా ఎలాంటి ప్రయోజనం లేదు
  • వడ్డీ రాయితీలకు కండీషన్స్‌ అప్లై
  • వసలకూలీలకు సంక్షేమం అందేనా!

రైతుకు భరోసా, పేదలకు ఉపాధి, వలస కూలీలకు తిండిగింజలు, చిన్నవ్యాపారులకు పెద్దపీట, అసంఘటిత శక్తికి తీపి కబురు… ఓవరాల్‌గా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి గంటన్నర పాటు ఇవే మాట్లాడారు. దేశ నిర్మాణంలో పైకి కనిపించని పునాది లాంటి ఈ వర్గాలకే ప్యాకేజ్ ప్రకటించారు. వలసకూలీలను కేంద్రం సకాలంలో ఆదుకోలేకపోయిందన్న విమర్శలకు చెక్‌గా వన్ నేషన్‌.. వన్‌ రేషన్‌ను అప్లై చేశారు. వాటితోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఇక రైతులకు మారటోరియం, వడ్డీ రాయితీలు, అదనపు రుణాలు అనౌన్స్ చేశారు. ఇక అసంఘటిత శక్తికి వస్తే.. వాళ్లకీ అపాయింట్‌మెంట్ లెటర్లు, బీమా, గ్రాట్యుటీ, హెల్త్‌ టెస్ట్‌వంటివీ ఇకపై ఉంటాయని భరోసా ఇచ్చారు. మధ్యతరగతికి ఆవాస్‌యోజన కొనసాగింపు, చిరువర్తకులకు ముద్ర లోన్స్‌లో వడ్డీ మాఫీ ప్రకటించారు. మరి నిజంగానే నిర్మలమ్మ ప్రకటించిన ప్యాకేజీ ఆయా వర్గాలకు వరమేనా.

వాస్తవానికి సాగురంగానికి ప్రకటించిన ప్యాకేజీలో మారిటోరియం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం లేదన్నది రైతాంగం నుంచి వినిపిస్తున్న మాట. వాతావరణం సహకరించింది. ఆరుగాలం కష్టపడి అన్నదాత మంచి దిగుబడితో మార్కెట్లోకి వస్తున్నాడు. తెలంగాణ వంటి ఒకటి రెండు రాష్ట్రాలు పంటను పూర్తిగా కొంటున్నా.. చాలాచోట్ల రైతులకు మార్కెటేట్లే ఆధారంగా. అలాంటప్పుడు పంటను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తే బాగుండేది. కేవలం రూ.6700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందన్న విమర్శలున్నాయి. 55శాతం పంటలకు వర్షాధారామే అయినా గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి సాకారమయింది. ఈ ఏడాది ఏకంగా 290 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పైగా పంట వచ్చింది. వరసగా ఐదేళ్ల పాటు దేశీయంగా పండిన ఆహార ఉత్పత్తుల తీరు కింద ఫోటోలో చూడవచ్చు.

వచ్చే ఏడాది కూడా వర్షపాతం వందశాతం ఉంటుందని ప్రకటించింది IMD. దీంతో కోవిడ్‌ కష్టంలో కూడా వ్యవసాయంలో 3శాతం వృద్ధిరేటు ఉంటుందని అంచనా. జీడీపీలో 5శాతం వాటా వస్తుందని నీతీ ఆయోగ్‌ ప్రకటించింది. మరి ఇంతగా దేశ ఆర్ధిక రంగాన్ని ఆదుకుంటున్న సాగు రంగానికి తగినట్టుగా ప్యాకేజీ ఇవ్వలేకపోయిందని రైతు సంఘాలంటున్నాయి. బ్యాంకుల్లో రుణాలు తీసుకోమని చెప్పిన ప్రభుత్వం… పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా కల్పించలేకపోయిందన్నిది ప్రధాన విమర్శ.

దేశంలో 58శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగంపై కేంద్రం చిన్నచూపే చూసిందని అంటున్నాయి రాష్ట్రాలు. 2022 నాటికి రైతులు ఆదాయం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ మిషన్‌కు తగ్గట్టు ప్యాకేజీ లేదని టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో అన్నారు ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ కన్వీనర్‌ నాగిరెడ్డి. పండ్ల ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశం…. సీజన్‌లో ఉన్నా కనీసం వాటిని కొనుగోలు చేసేందుకు నిధులు ఇస్తారని ఆశించినా కేంద్రం ప్యాకేజీలో ప్రస్తావన లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసిందన్నారు నాగిరెడ్డి. కేంద్రం ప్రతి ఏడాది రైతులకు ఇచ్చే రుణాలపై పెట్టుకున్న లక్ష్యాలనే బ్యాంకులు చేరుకోవడం లేదు. మళ్లీ అధిక రుణాలు ఇస్తామని ప్రకటించడం ద్వారా రైతులను మోసం చేయడమేనని అంటున్నారు CPI నారాయణ. మొక్కబడి ప్యాకేజీలతో రైతులకు పెద్దగా ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అంటే నిర్మల ప్రకటించిన ప్యాకేజీ పట్ల ఎవరూ సంతృప్తిగా లేరన్నది కళ్లముందు కనిపిస్తోంది. ధాన్యం సేకరణ కోసం నిధులు ఇస్తారని భావించినా.. కేంద్రం ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. రికార్డు స్థాయిలో పండిన పంటను సేకరించడానికి రాష్ట్రాల వద్ద నిధులు లేవు.. కేంద్రం ఇవ్వడం లేదు.

తెలంగాణలో పండిన ధాన్య వివరాలు…

  • 2019-20లో తెలంగాణలో రికార్డు ఉత్పత్తి
  • యాసంగిలో 39.24 లక్షల ఎకరాల్లో వరి సాగు
  • 1.10 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి
  • గత వానాకాలం సీజన్‌లో 31.50 లక్షల ఎకరాల్లో వరి సాగైంది
  • 95 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట
  • గతేడాదితో 66 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు దిగుబడి
  • 2019-20లో 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
  • వరితో పాటు ఇతర గ్రెయిన్స్‌ దిగుబడి 42శాతం పెరిగింది
  • 37లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
  • నూనె ఉత్పత్తి పంటలు 42వేల మెట్రిక్ టన్నులు

APలో పంటల దిగుబడి వివరాలు…

  • 2019–20లో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి
  • కందులు, మినుములు, వేరుశనగ, శనగ, మొక్కజొన్న పంటలు
  • 23.29 లక్షల హెక్టార్లు రికార్డు స్థాయిలో వరి సాగు విస్తీర్ణం
  • 137 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయిన ధాన్యం
  • ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2019–20లో ఉత్పత్తి
  • 2018–19లో 150 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు
  • వచ్చే ఏడాది 172 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంటుందని అంచనా
  • 2.38 లక్షల హెక్టార్లలో కంది సాగు
  • ఉత్పత్తి 2.01 లక్షల మెట్రిక్‌ టన్నులు
  • 2018–19తో పోల్చి చూస్తే 136 శాతం ఎక్కువ
  • 2018–19లో కందుల ఉత్పత్తి కేవలం 0.46 లక్షల మెట్రిక్‌ టన్నులు
  • మొక్క జొన్న సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో 2019–20లో రికార్డు
  • 2.83 లక్షల హెక్టార్లలో సాగు , 19 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి

సాగులో మంచి అవకాశాలున్నాయి.

  • దేశీయంగా ఉత్పత్తి అవుతున్న సాగు ఉత్పత్తులకు డిమాండ్‌
  • కోల్డ్‌ సోరేజీలు, గోదాములు పెరగడంతో డిమాండ్‌
  • 2022 నాటికి ఎగుమతులు, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంగా కొత్త విధానాలు
  • రైతుల్లో పోటీతత్వం వల్ల మార్కెట్లోకి కొత్తకొత్త ఉత్పత్తులు
  • అయితే కేంద్రం నుంచి కూడా సకాలంలో సరైన సాయం అందితే… భవిష్యత్తులో ఆర్ధిక రంగానికి బలమైన పునాదలు అందిస్తుంది
  • సాగురంగం. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ పట్ల సంతృప్తిగా లేరు రైతులు. మరి భవిష్యత్తులో అయినా ఆదుకుంటారా?

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.