జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు , రాశులకు ముఖ్య స్థానం ఉంది. నవగ్రహాల్లో శుక్రుడి సంచారానికి ప్రముఖ స్థానం ఉంది. అంతేకాదు ఈ శుక్ర గ్రహణాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇప్పటికే కర్కాటక రాశిలో ఉన్న శుక్ర గ్రహం.. ఈ నెల (జూలై) 31న శుక్రుడు సూర్యుని రాశి సింహ రాశిలో సంచరించనుంది. ఈ సంచారం కారణంగా అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై ప్రభావం చూపించనుంది. కొన్ని రాశుల వారికి వారం రోజుల పాటు శుభాలను తీసుకుని రానుంది. ఆకస్మిక ధన లాభం కలుగనుంది. అంతేకాదు ఇప్పటి వరకూ వాయిదా పడుతున్న పనులు అన్నీ పూర్తి అవుతాయి. ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారంతో జూలై 31వ తేదీ నుంచి వారం రోజుల పాటు ధన లాభాన్ని అందుకోనున్న రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్రుడు సంచారం వలన శుభప్రదంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య స్నేహ వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఆదాయపరంగా రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్త వింటారు. అంతేకాదు నాలుగు విధాలుగా డబ్బులు సంపాదిస్తారు.
మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్ర గ్రహ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది. వృత్తి , ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు తీరతాయి. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది.
సింహరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు లభిస్తాయి. అంతేకాదు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంపై పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు.. అంతేకాదు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక స్తితి మెరుగుపడి డబ్బుల కొరత తీరుతుంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యంగా ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు