Zodiac Signs: శుభ గ్రహాలైన బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో కలిసికట్టుగా సంచరిస్తున్నాయి. సాధారణంగా సింహ రాశిలో ఏ గ్రహం ప్రవేశించినా అది హుందాగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశిలో కలిసి ఉన్న బుధ, శుక్రులు ఆగస్టు 8వ తేదీ వరకు కలిసి ఉంటాయి. ఈ రెండు వారాల కాలంలో ఇవి జీవితానికి సంబంధించి యాంబిషన్ ను పెంచుతాయి. కోరికలు గుర్రాలవుతాయి. సరికొత్త జీవితాశయాలు, ఆకాంక్షలు ఏర్పడతాయి. వీటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన పట్టుదల, మొండి ధైర్యం కూడా ఏర్పడతాయి. ఇందులో బుధ గ్రహానికి సింహ రాశి మిత్ర క్షేత్రం అయినందువల్ల ఇది మరింత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
మేషం: ఈ రాశివారికి పంచమ స్థానంలో బుద్ధి కారకుడైన బుధుడు, యాంబిషన్ కు కారకుడైన శుక్రుడితో కలిసి సంచరించడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి మరింత మంచి ఉద్యోగా నికి మారాలనే తపన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను కూడా విస్తరించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. జీవితాన్ని సానుకూల మలుపు తిప్పడానికి ప్రయత్నం ప్రారంభం అవుతుంది. ఇవి సానుకూలపడే అవకాశం ఉంది.
వృషభం: ఈ రాశికి బుధ, శుక్ర గ్రహాలు అత్యంత శుభులు. ఇవి రెండూ కలిసి నాలుగవ స్థానంలో సంచరిం చడం అనేది ఒక యోగాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా గృహ, వాహన సౌకర్యాలను ఏర్పరచుకోవ డానికి కృషి ప్రారంభం అవుతుంది. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా మారు తుంది. ఆస్తి సంబంధమైన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవ కాశం ఉంటుంది. పిల్లలు లేదా విద్యార్థులు చదువుల్లో పురోగతి సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది.
మిథునం: ఈ రాశి నాథుడైన బుధుడు తన మిత్రక్షేత్రమైన సింహరాశిలో మరో శుభ గ్రహమైన శుక్రుడితో సంచరించడం వల్ల రాజకీయ, ప్రభుత్వ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఈ పరిచయాల వల్ల జీవితం ఆశించిన మలుపు తిరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం పొందడం జరుగుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.
కర్కాటకం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రెండు శుభ గ్రహాలు చేరడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు అంది వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అనేక ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులు
శుభవార్త వింటారు.
సింహం: ఈ రాశిలో రెండు శుభ గ్రహాలు సంచరించడం వల్ల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, పేరు ప్రఖ్యాతులు పెరగడం, వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభించడం వంటివి తప్పకుండా జరిగే అవకా శం ఉంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితంలో అన్యో న్యత, సామరస్యం పెరుగుతాయి. సమయస్ఫూర్తితో కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగాలలో చేరడానికి ఇది చాలా అనుకూల సమయం.
కన్య: ఈ రాశికి ఈ కలయిక కొద్దిగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి నాథుడైన బుధుడు తన మిత్రుడైన శుక్రుడితో తన మిత్ర క్షేత్రమైన సింహరాశిలో సంచరించడం బాగానే ఉన్నప్పటికీ ఇది వ్యయ స్థానం అయినందువల్ల ఆదాయం వృథా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రహస్య శత్రువులు తయారవుతారు.
సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డబ్బు దాచుకునే లేదా మదుపు చేసే అవకాశం ఉంది.
తుల: బుధ, శుక్రులు లాభ స్థానంలో కలవడం ఈ రాశివారికి ఒక విధమైన భాగ్య యోగాన్ని కలగ జేస్తుంది. ఈ రాశి నాథుడైన శుక్రుడు తన మిత్రుడైన బుధుడితో కలవడం వల్ల వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుని లాభాల బాటలో పడతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారం
చేపట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా పురోగతి ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలిసి ఉన్నందువల్ల, ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారదలచుకున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకు వెడతారు. కుటుంబంలో సుఖ శాంతులు ఏర్పడతాయి. ఒంటి చేత్తో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి.
ధనుస్సు: భాగ్య స్థానంలో బుధ, శుక్ర గ్రహాల సంచారం వల్ల ఆర్థిక సంబంధమైన అదృష్టం పట్టడానికి అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు, షేర్లు వంటి వాటివల్ల లాభం
కలుగుతుంది. సామాజిక హోదా పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. విదేశాల నుంచి చదువులు, ఉద్యోగాల పరంగా ఆహ్వానాలు అందే సూచనలున్నాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉంటుంది.
మకరం: సింహ రాశి ఈ రాశికి అష్టమ రాశి అయినందువల్ల ఇక్కడ బుధ, శుక్రులు సంచరించడం వల్ల ఈ రాశివారికి ప్రత్యేక ప్రయోజనాలేవీ ఉండకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.
కుంభం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నందువల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడడం, ప్రేమ వ్యవహారాల్లో పురోగతి సాధిం చడం వంటివి జరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. రాజకీయాలు, ప్రభుత్వంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
మీనం: ఈ రాశివారికి ఈ శుభ గ్రహాల సంయోగం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అనుకోని సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అనవసర పరిచయాలతో అవస్థలు పడతారు.
మరిన్ని రాశిఫలాలకు సంబంధించిన వార్తల కోసం క్లిక్ చేయండి..