Telugu News Astrology Thursday Astro Tips: what is harnful to do in thursday makes you pauper In Telugu
Thursday Astro Tips: గురువారం ఈ తప్పులు చేస్తే.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు.. అవి ఏమిటో తెలుసుకోండి..
గురువారం పొరపాటున కూడా కొన్ని చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి పనులు చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవచ్చు, కష్టాలు రావచ్చు. గురువారం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గురువారం రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
హిందూమతంలో ప్రతి దినానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. వారంలో ప్రతి ఒక్క రోజూ ఒకొక్క దేవుడికి, దేవతకు కేటాయిస్తారు. గురువారం విష్ణువుకు అంకితం చేయబడిన రోజు. గురువారం శ్రీ మహా విష్ణువును పూజించి, ఉపవాసం ఉన్నవారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు గురువారం పొరపాటున కూడా కొన్ని చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి పనులు చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడవచ్చు, కష్టాలు రావచ్చు. గురువారం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గురువారం రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
గురువారం రోజున బట్టలు ఉతకకూడదు. అలాగే మాసిన బట్టలు ఉతకడానికి ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది.
ఇంటికి గురువారం నీటితో శుభ్రం చేయరాదు. ముందు రోజు తడి బట్టతో వేసుకోవాలి. గురువారం తడి బట్ట వేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానంపై చెడు ప్రభావం చూపుతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం.
మహిళలు తలకు షాంపూ చేసుకోరాదు. గురువారం నాడు తలంటు పోసుకునేవారి జాతకంలో కుజుడు బలహీనుడు అవుతాడు.
గురువారం నాడు చేతులు, కాళ్ళ గోళ్ళను కత్తిరించుకోరాదు. ఈ నియమాలు పాటించని వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది.