Astrology: శుభ గ్రహాలన్నీ అనుకూలం.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు
శుభ గ్రహాలు మూడూ ఏ రాశికైనా అనుకూలంగా ఉండడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ నెల 19వ తేదీన శుక్ర గ్రహం తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి ప్రవేశిస్తోంది. దీంతో కొన్ని రాశులకు గురు, శుక్ర, బుధ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం జరగబోతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ మూడు శుభ గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి సిరిసంపదలను, భోగ భాగ్యాలను అనుగ్రహించబోతున్నాయి.
శుభ గ్రహాలు మూడూ ఏ రాశికైనా అనుకూలంగా ఉండడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ నెల 19వ తేదీన శుక్ర గ్రహం తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి ప్రవేశిస్తోంది. దీంతో కొన్ని రాశులకు గురు, శుక్ర, బుధ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం జరగబోతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ మూడు శుభ గ్రహాల సంచారం మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి సిరిసంపదలను, భోగ భాగ్యాలను అనుగ్రహించబోతున్నాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర, బుధులు యోగదాయకంగా మారడంతో పాటు, శని కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచ నాలను మించుతాయి. నిరుద్యోగులకు అనేక విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. జరగాల్సిన శుభకార్యాలు నిరాటంకంగా జరిగిపోతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా మారుతుండడంతో అష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తి కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు దాదాపు పూర్తిగా నష్టాల నుంచి బయటపడతాయి. కుటుంబపరంగా శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కన్య: ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలతతో ధన, భాగ్య స్థానాలు బాగా పటిష్ఠం అవుతున్నాయి. శుభ గ్రహాలతో పాటు శనీశ్వరుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం దిన దినాభి వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఒప్పందాలు విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు రాబడి బాగా వృద్ధి చెందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశిలో ఈ నెల 19న రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశించినప్పటి నుంచి శుభ గ్రహాల అనుకూల తలు బాగా వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి శుభ గ్రహాలతో పాటు శనీశ్వరుడి తోడ్పాటు కూడా లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా తప్ప కుండా వృద్ధి, పురోగతి ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా లాభదాయక విజయాలు సాధి స్తారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవ కాశాలు అంది వస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- మకరం: ఈ రాశికి మూడు శుభ గ్రహాలతో పాటు శని, రాహువుల అనుకూలతలు కూడా జోడవుతు న్నందు వల్ల జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పగల శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వారసత్వపు ఆస్తి లభి స్తుంది. వివాదాలు, కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.