Kuja Dosha Remedies: ఆ రాశుల వారికి కుజ దోషం..! దోష నివారణకు పరిహారాలు ఇలా చేయండి

| Edited By: Janardhan Veluru

Sep 24, 2023 | 9:25 PM

జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో లగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు దాన్ని కుజ దోషంగా పరిగణిస్తారు. భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే కుజ దోషం ఉన్నప్పుడు దారుణమైన ఫలితాలను ఇస్తుందనీ, వివాహ బంధాన్ని దెబ్బ తీస్తుందనీ, ఇద్దరికీ ఆ దోషం ఉన్న ప్పుడు దోషం ఉండదనీ జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. గ్రహ సంచారంలో కూడా ఈ స్థానాల్లో కుజ సంచారాన్ని బట్టి ఈ కుజ దోషం ఏర్పడుతుంది.

Kuja Dosha Remedies: ఆ రాశుల వారికి కుజ దోషం..! దోష నివారణకు పరిహారాలు ఇలా చేయండి
Kuja Dosha
Follow us on

కుజ దోషం గురించి విననివారుండరు. కుజ దోషాన్నే మాంగల్య దోషమని కూడా అంటారు. వైవాహిక జీవితంలో ఈ దోషం సృష్టించే కష్టనష్టాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణంగా, జ్యోతిష శాస్త్రం ప్రకారం, జాతక చక్రంలో లగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు దాన్ని కుజ దోషంగా పరిగణిస్తారు. భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే కుజ దోషం ఉన్నప్పుడు దారుణమైన ఫలితాలను ఇస్తుందనీ, వివాహ బంధాన్ని దెబ్బ తీస్తుందనీ, ఇద్దరికీ ఆ దోషం ఉన్న ప్పుడు దోషం ఉండదనీ జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. గ్రహ సంచారంలో కూడా ఈ స్థానాల్లో కుజ సంచారాన్ని బట్టి ఈ కుజ దోషం ఏర్పడుతుంది. ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న కుజుడి వల్ల ఆరు రాశులకు ఈ దోషం ఏర్పడుతోంది. అవిః మిథునం, సింహం, కన్య, తుల, కుంభం, మీనం. అక్టోబర్ 3 వరకు కుజుడు కన్యారాశిలో సంచరించడం జరుగుతుంది.

  1. మిథునం: ఈ రాశికి నాలుగవ స్థానంలో అంటే సుఖ స్థానంలో కుజ సంచారం జరుగుతున్నందువల్ల కుజ దోషం ఏర్పడింది. ఇక్కడ ఈ దోషం వల్ల దాంపత్య సుఖం కరువవుతుంది. భార్యాభర్తల మధ్య టెన్షన్లు చోటు చేసుకుంటాయి. తీవ్ర స్థాయిలో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు, పిల్లలకు సంబంధించిన కార్యకలాపాల విషయంలో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం లేదా అష్టకం చదువుకోవడం వల్ల పరిస్థితి మారే అవకాశం ఉంటుంది.
  2. సింహం: ఈ రాశికి రెండవ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల ఈ దోషం ఏర్ప డింది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక నిర్వహణ, ఆర్థిక సమస్యలు, అపార్థాల కారణంగా దంపతుల మధ్య తీవ్రస్థాయి విభేదాలు తలెత్తవచ్చు. తొందరపడి మాట్లాడడం, వాదించడం వంటివి చోటు చేసుకుంటాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే ముందు సతీమణిని సంప్రదించడం మంచిది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఈ దోషం నివారణ అవుతుంది.
  3. కన్య: ఈ రాశిలోనే కుజ సంచారం చోటు చేసుకున్నందువల్ల ఈ దోషం ఏర్పడుతోంది. దురహంకారం, ఆధిపత్య ధోరణి, కోపతాపాల కారణంగా భార్యాభర్తల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఓర్పు, సహనాలతో, అవగాహనతో వ్యవహరించడం వల్ల నష్ట నివారణ జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో భార్యను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని గ్రహించాలి. భార్యాభర్తల్లో ఒకరికి కొద్దిగా అనారోగ్యం సోకే అవకాశం కూడా ఉంది. సుందరకాండ పారాయణ వల్ల దోష నివారణ జరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి 12వ స్థానంలో అంటే శయన స్థానంలో ఈ దోషం చోటు చేసుకోవడం వల్ల దాంపత్య సుఖం తగ్గే అవకాశం ఉంటుంది. అనవసర కోపతాపాలు, అహంకార ధోరణి, మానసిక ఒత్తిడి కార ణంగా శృంగార జీవితాన్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. లైంగిక సమస్యలు తలెత్తే అవ కాశం కూడా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రవర్తన లోపాలు దాంపత్య జీవితాన్ని సమస్యలకు గురి చేయడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల దోష నివారణ జరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కుంభం: ఈ రాశికి అష్టమ స్థానంలో అంటే మాంగల్య స్థానంలో కుజ సంచారం వల్ల, అనారోగ్యాలు, ప్రమాదాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, డిప్యుటేషన్లు, బదిలీలు వంటి కారణాలు దాంపత్య సుఖాన్ని దూరం చేస్తాయి. భార్యాభర్తలు సంయమనంతో, సహనంతో వ్యవహరించడం చాలా మంచిది. ఈ రకమైన ఎడబాట్లు తాత్కాలికమేనని అర్థం చేసుకోవాలి. ఏదైనా అనారోగ్యం సోకినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల బంధం పటిష్టమవుతుంది.
  7. మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో, అంటే కళత్ర స్థానంలో ఈ దోషం ఏర్పడుతున్నందువల్ల ఏదో ఒక కారణంగా భార్యాభర్తల మధ్య ఎడబాటు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మనస్పర్థలకు కూడా అవకాశం ఉండవచ్చు. అనవసర పరిచయాలు, విశ్వాసంలోకి తీసుకోకపోవడం, జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని పనులు చేయడం వంటివి అపార్థాలకు దారి తీసే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. తరచూ శివార్చన చేయించడం వల్ల సమస్యలు దగ్గరకు రావు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.