
Astrology
ప్రస్తుతం జాతక చక్రంలో కుజ, రవి, గురు, శనులు బాగా బలంగా ఉన్నందువల్ల వీటికి సంబంధించిన నక్షత్రాల వారు తప్పకుండా శుభ ఫలితాలను అనుభవించడం జరుగుతుంది. రవికి సంబంధించిన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, కుజుడికి చెందిన మృగశిర, చిత్త, ధనిష్ట, గురు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, శనీశ్వరుడి నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర వారు అందలాలు ఎక్కడం, అదృష్టాలను అనుభవించడం జరుగుతుంది. ఈ పన్నెండు నక్షత్రాల వారికి వచ్చే నెల 16వ తేదీ వరకు అన్ని విధాలుగానూ కలిసి వచ్చే కాలమని చెప్పవచ్చు. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, కొత్త పనులు తలపెట్టడానికి, కొత్త వ్యూహాలు ప్రవేశపెట్టడానికి ఇది యోగ కాలంగా ఉండే అవకాశం ఉంది.
- కృత్తిక: ఈ నక్షత్రాధిపతి అయిన రవి తన మిత్రక్షేత్రమైన వృశ్చికంలో, మిత్రుడైన కుజుడితో కలవడం వల్ల తప్పకుండా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రభుత్వంతో ముడిపడిన వ్యవ హారాలన్నీ నెరవేరుతాయి. ప్రభుత్వపరంగా ఊహించని మేలు జరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. సతీమణికి కూడా మంచి యోగం పడుతుంది.
- మృగశిర: ఈ నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలో డిసెంబర్ 27 వరకూ సంచా రం చేస్తున్నందువల్ల ఈ నక్షత్రం వారికి ఏ విషయంలోనూ తిరుగుండకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు ఏ స్థాయిలో ఉన్నా కొద్ది ప్రయత్నంతో పరి ష్కారం అవుతాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో ఆశిం చిన స్థాయిలో అధికారం దక్కడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- పునర్వసు: ఈ నక్షత్రాధిపతి అయిన గురువు ప్రస్తుతం తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ నక్షత్రంవారికి జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతానం లేనివారికి సంతానం యోగం కలుగు తుంది. ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయపరంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు మేలు చేకూర్చే పనులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది.
- పుష్యమి: ఈ నక్షత్రానికి అధిపతి అయిన శనీశ్వరుడు తన స్వస్థానమైన కుంభ రాశిలో సంచరించడం వల్ల ఈ నక్షత్రం వారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా మసఫలం అవుతాయి. చాలా కాలం నుంచి అనుకుంటున్న తీర్థయాత్రలు, విహార యాత్రలు ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది.
- ఉత్తర: ఈ నక్షత్రాధిపతి రవి తన మిత్రక్షేత్రమైన వృశ్చికంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. రాజకీయంగా, ప్రభుత్వపరంగా బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్, మెడిసిన్, ఆరోగ్యం వంటి రంగాలకు చెందిన వారికి ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- చిత్త: ఈ నక్షత్ర నాథుడైన కుజుడు స్వస్థానంలో రవితో కలిసి సంచారం చేస్తున్నందువల్ల, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వివాహ, ఉద్యోగ ప్రయ త్నాలు సఫలం కావడంతో పాటు, ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా ఘన విజయం సాధిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.
- విశాఖ: గురువు అధిపతి అయిన ఈ నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభ యోగం పట్టే అవకాశం ఉంది. ధనపరంగా, కుటుంబపరంగా ఈ నక్షత్రం వారు కొన్ని శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమాజంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజ కీయంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. అనుకోకుండా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది.
- అనూరాధ: ఈ శనీశ్వరుడి నక్షత్రం వారికి రాజయోగం పడుతుంది. సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారే సూచనలున్నాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం గానీ, అధికారాలను పంచడం గానీ జరుగుతుంది. ప్రభుత్వపరంగా కొన్ని లాభ దాయకమైన అవకాశాలు అంది వస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
- ఉత్తరాషాఢ: ఈ నక్షత్రానికి అధిపతి అయిన రవి వృశ్చిక రాశిలో, తన మిత్రుడైన కుజుడితో కలిసి ఉన్నందు వల్ల ఒక కనీ వినీ ఎరుగని ధన యోగానికి అవకాశం ఏర్పడింది. ఆకస్మిక ధన యోగానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక రుణ సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
- ధనిష్ట: ఈ తారకు అధిపతి అయిన కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో రవితో కలిసి ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగ ప్రయ త్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. కీర్తి మప్రతిష్ఠలు ఇను మడిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు క్షణం కూడా తీరిక లేనంత బిజీ అయిపోతాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గడంతో పాటు, మంచి గుర్తింపు లభిస్తుంది.
- పూర్వాభాద్ర: ఇది గురు నక్షత్రం అయినందువల్ల ఈ నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడు తుంది. ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాధాన్యం పెరగడంతో పాటు, సంపాదన బాగా పెరుగుతుంది. ప్రముఖు వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన యోగా నికి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ, వాహన యోగాలున్నాయి.
- ఉత్తరాభాద్ర: ఈ నక్షత్రానికి అధిపతి అయిన శనీశ్వరుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గిపోవడమే కాకుండా, రాజకీయంగా, సామాజికంగా మంచి గుర్తింపు లభించడం, మాటకు, చేతకు విలువ పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా మీ మాటకు తిరుగుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.