AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఈ రాశుల వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ఛాన్స్..! ఈ ఏడాదంతా జాగ్రత్త

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అష్టమ, వ్యయ స్థానాల్లో శని, రాహు, కేతు వంటి పాపగ్రహాల ప్రభావం ఉన్నవారు ఇతరులను తేలికగా నమ్మడం వల్ల మోసాలు, నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, మీన రాశుల వారు ఈ ఏడాదంతా ఆర్థిక వ్యవహారాలు, భాగస్వామ్యాలు, కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. నమ్మక ద్రోహం, వంచన వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నందున ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం మంచిది.

Astrology: ఈ రాశుల వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ఛాన్స్..! ఈ ఏడాదంతా జాగ్రత్త
Rahu Ketu Shani Effect
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2026 | 7:44 PM

Share

జ్యోతిషశాస్త్రాన్ని బట్టి జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ అష్టమ, వ్యయ స్థానాల్లో శని గానీ, రాహువు గానీ, కేతువు గానీ ఉన్న రాశులవారు తేలికగా మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంటుంది. వీరు వంచనకు, నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా అష్టమ, వ్యయ స్థానాల్లో పాప గ్రహాలున్నవారు భోళా మనుషులు, అమాయకులు, సాత్వికులు ఇతరులను తేలికగా, గుడ్డిగా నమ్మేవారు అయి ఉంటారు. ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి మేషం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, మీన రాశుల వారు ఈ ఏడాదంతా తరచూ మోసపోవడం, నష్టపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.

మేషం

ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారు ఈ ఏడాది అనేక పర్యాయాలు ఆర్థికంగా మోసపోవడం, ధన నష్టానికి గురి కావడం జరుగుతుంది. బంధుమిత్రులు, బాగా సన్నిహి తుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వంచనకు, నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తమ బలహీనతలు, రహస్యాలు బయటపెట్టకపోవడం శ్రేయస్కరం.

కర్కాటకం

ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం మిత్రుల వల్ల, బంధువుల వల్ల వృథా కావడం జరుగుతుంది. వీరు పొగడ్తలకు, విషాద కథనాలకు లొంగిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. అందువల్ల నష్టపోవడం, మోసపోవడం ఎక్కువగా జరుగుతుంది. ఉచిత సహాయాలు, దానధర్మాల వల్ల నష్టపోవడం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా నష్టం కలిగిస్తాయి.

సింహం

ఈ రాశికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఈ రాశి వారు తరచూ విఫలమవుతుంటారు. వృథా ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. నమ్మకూ డని వ్యక్తులను నమ్మడం, నమ్మాల్సిన వ్యక్తులను దూరంగా పెట్టడం జరుగుతుంది. ఆర్థిక బాధ్య తలను ఇతరులకు అప్పగించి నష్టపోవడం జరుగుతుంది. పొగడ్తలకు లొంగిపోయే తత్వం వల్ల ఎక్కువగా వంచనకు గురి కావడం జరుగుతుంది. బంధుమిత్రులు మోసగించే అవకాశం ఉంది.

కన్య

ఈ రాశికి వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద ఈ రాశి వారికి శ్రద్ద ఉండకపోవచ్చు. రావలసిన సొమ్మును రాబట్టుకోవడం కూడా కష్టమవుతుంది. రహస్య శత్రువులు తరచూ మోసగించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా తరచూ నష్టపోయే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బాగా సన్నిహితులు పక్కదారి పట్టించడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులను గుడ్డిగా నమ్మడం వల్ల కష్టార్జితం వృథా అవుతుంది.

మకరం

ఈ రాశికి అష్టమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారు ఎక్కువగా ఉచిత సహాయాలకు, దాన ధర్మాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. పొగడ్తలకు లొంగిపోవడం, మితిమీరిన ఔదార్యం కలిగి ఉండడం, రుణంగా ఇచ్చిన ధనాన్ని రాబట్టుకోలేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. సహాయం పొందిన తర్వాత ముఖం చాటేసేవారు ఎక్కువగా ఉంటారు. మొండి బాకీలు ఎక్కువగా ఉంటాయి. కొందరు వీరి ఔదార్యాన్ని, అమాయకత్వాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందుతారు.

మీనం

ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారిలో ఔదార్యం, అమాయకత్వం, దయా గుణం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వీరిని బంధుమిత్రులతో పాటు, సహచరులు, భాగ స్వాములు కూడా మోసగించడానికి అవకాశం ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో బంధువుల వల్ల, ఉద్యోగంలో సహచరుల వల్ల, వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల ధన నష్టాలు, వంచనలు ఎక్కువగా జరుగుతాయి. డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేయడం ఎక్కువగా జరుగుతుంది.

Follow Us
ఈ రాశుల వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ఛాన్స్..!
ఈ రాశుల వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ఛాన్స్..!
తక్కువ సమయంలో తయారయ్యే టేస్టీ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ పొంగల్..
తక్కువ సమయంలో తయారయ్యే టేస్టీ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ పొంగల్..
డబ్బు రెట్టింపు చేస్తామంటూ మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..
డబ్బు రెట్టింపు చేస్తామంటూ మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..
స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా రావడం వెనక కారణం ఇదే!
స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా రావడం వెనక కారణం ఇదే!
పురోహితుల కంటే ముందే స్వామిని చూసే అదృష్టం ఆయనదే!
పురోహితుల కంటే ముందే స్వామిని చూసే అదృష్టం ఆయనదే!
బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ
బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఈ నటుడి సొంత సోదరుడు తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా..?
ఈ నటుడి సొంత సోదరుడు తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా..?
'పెద్ది' నుంచి మరో సర్‌ప్రైజ్..వైరల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
'పెద్ది' నుంచి మరో సర్‌ప్రైజ్..వైరల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
రోజుకు 10,000అడుగులు అవసరమా?తక్కువ నడకతోనూ గుండెను కాపాడుకోవచ్చు!
రోజుకు 10,000అడుగులు అవసరమా?తక్కువ నడకతోనూ గుండెను కాపాడుకోవచ్చు!