Surya Grahan 2023: సనాతన హిందూ ధర్మంలో సూర్యచంద్రుల గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాలు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇక వాటిలో రెండు సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు. మరోవైపు ఈ నెల అంటే ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. కానీ ఈ సూర్యగ్రహణం అన్ని రాశులవారిని కూడా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సూర్య గ్రహణం కొన్ని రాశులవారికి శుభప్రదంగా, అలాగే మరి కొందరికి అశుభంగా ఉంటుంది. మరి రాశిచక్రంలోని ఏయే రాశులకు ఈ సూర్యగ్రహణం శుభంగానూ.. ఏ రాశులకు అశుభంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఏటా ఏర్పడిన మాదిరిగానే ఈ ఏడాది కూడా సూర్యగ్రహణం రెండు సార్లు ఏర్పడనుంది. ఇక 2023 సంవత్సరంలో ఏప్రిల్ 22న మొదటి సూర్యగ్రహణం కలుగుతుంది. అయితే ఈ గ్రహణం మేషం, ధనుస్సు, మకరం, మీన రాశులకు అశుభంగా ఉండనుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే గ్రహణం సమయంలో ఈ 4 రాశులవారికి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మానసిక ఆందోళన ఎదురవుతాయి. ఇంకా ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు.
సూర్యగ్రహణం సమయానికి సూర్యభగవానుడు మేషరాశిలో సంచరిస్తుంటాడు. ఏదైనా రాశిలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటే అది వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడి ఉచ్ఛస్థితి కారణంగా కర్కాటకం, కుంభం, వృశ్చిక రాశులవారు ప్రయోజనం పొందుతారు. ఈ రాశులవారు ఈ సమయంలో వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.
మరిన్ని జ్యోతిష్యశాస్త్ర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..