హిందూ మతంలో ఆదివారం చేసే ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందువుల విశ్వాసం ప్రకారం ఆదివారం రోజున సూర్య భగవానుని పూజించాలనే నియమం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు ఇతర గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయితే సూర్య భగవానుని పూజించడం, ఆదివారం ఉపవాసం ఉండడం వల్ల మేలు జరుగుతుంది. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, అదృష్టాలు లభిస్తాయి. ఆదివారం పూజ మతపరమైన ప్రాముఖ్యత.. ఉపవాసం చేయడానికి సరైన మార్గం ఏమిటో మనం తెలుసుకుందాం.
ఆదివారం భాస్కరుని అనుగ్రహం పొందడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం శుభ్రమైన రాగి పాత్రను తీసుకుని అందులో నీటిని తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అప్పుడు పూజా స్థలంలో ఎర్రని చాప లేదా ఏదైనా ఎర్రటి దుప్పటిపై కూర్చుని సూర్య భగవానుని పూజించడం ప్రారంభించండి. సూర్య భగవానుడి బీజ్ మంత్రంతో జపమాలతో ఐదు మార్లు జపించండి. ఆ తర్వాత ఆదివారం ఉపవాసం, ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి.
సూర్య నారాయణునికి ధూపం, అక్షత, పాలు, ఎర్రటి పువ్వులు, అర్ఘ్యం సమర్పించడం ఒక ప్రత్యేక ఫలంగా పరిగణించబడుతుంది. ఆదివారం పూజ సమయంలో సూర్య భగవానుడికి ఎర్రచందనం సమర్పించిన తర్వాత, దానిని ప్రసాదంగా నుదుటిపై ధరించండి. సూర్యదేవుడి నమస్కారం ముందు.. మీరు నిలబడి ఉన్న ప్రదేశం చుట్టూ తిరిగి అర్ఘ్యం సమర్పించి నమస్కరించండి.
ఆదివారం ఉపవాస సమయంలో గోధుమ రొట్టె లేదా బెల్లం కలిపి తినాలని నియమం ఉంది. ఈ ఉపవాస సమయంలో ఉప్పు అస్సలు తీసుకోరాదు. అటువంటి పరిస్థితిలో ఈ ఆహారం లేదా పానీయానికి ఉప్పు కలపవద్దు. ఉప్పుని ఏ విధంగానూ తినవద్దు. ఆదివారం వ్రత ఉద్యాపన చేసే సమయంలో కనీసం నలుగురు బ్రాహ్మణులకు ఆహారాన్ని అందించండి. ఎర్రటి బట్టలు, పండ్లు, స్వీట్లు, పువ్వులు, కొబ్బరికాయ, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం పొందండి.
సనాతన సంప్రదాయం ప్రకారం జీవితంలో కీర్తి, ఆనందం, శ్రేయస్సు పొందడానికి సూర్య భగవానుని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆదివారం ఉపవాసం సూర్యుని అనుగ్రహాన్ని పొందడానికి, సంతోషంగా, ఆరోగ్యంగా , గౌరవప్రదంగా ఉండటానికి ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం సూర్యభగవానుని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు