Sun Transit: త్వరలో రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..

|

Oct 10, 2024 | 12:40 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని ఈ సంచారము కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు డబ్బు, ఆస్తి, వ్యాపారంలో ఆర్థిక లాభం వంటి అనేక ప్రయోజనాలను పొందుతారని పేర్కొంది. సూర్యభగవానుడు అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7:47 గంటలకు కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలోనే సూర్యుడు నవంబర్ 16 వరకు ఉండనున్నాడు.

Sun Transit: త్వరలో రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..
Sun Transit In Libra
Follow us on

మానవ జీవితంలో మంచి చెడులు, శుభా ఆశుభాలు గ్రహాలు, రాశుల ఆధారంగా జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. నవ గ్రహాల అధినేత సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ 17వ తేదీ గురువారం కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుని ఈ సంచారము కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు డబ్బు, ఆస్తి, వ్యాపారంలో ఆర్థిక లాభం వంటి అనేక ప్రయోజనాలను పొందుతారని పేర్కొంది. సూర్యభగవానుడు అక్టోబర్ 17వ తేదీ ఉదయం 7:47 గంటలకు కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలోనే సూర్యుడు నవంబర్ 16 వరకు ఉండనున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో సూర్యభగవానుడు నీచ స్థితిలో ఉంటాడు. అయితే ఈ కాలం కొన్ని ప్రత్యేక రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. సూర్యుని ఈ సంచారము ముఖ్యంగా మేషం, తుల, కుంభ రాశులకు సంబంధించిన ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ రాశుల వారు ఆర్థిక, వృత్తిపరమైన, కుటుంబ ప్రయోజనాలను పొందుతారు.

మేష రాశి: తులారాశిలో సూర్యుని ప్రవేశం మేష రాశి వారికి అనుకూలమైన సమయాన్ని తెస్తుంది. వీరి పనిలో సామర్థ్యం పెరుగుతుంది. కెరీర్‌లో కొత్త శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం, శాంతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. అయితే ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అంతేకాదు ఈ సమయంలో భాగస్వామ్యంతో చేసిన వ్యాపారంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వీరికి అదృష్టం వెన్నంటి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తులా రాశి: తులారాశిలో సూర్యుని ప్రవేశం ఈ రాశి వారికి కొన్ని సవాళ్లను తీసుకుని వచ్చినా వీరికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు, గుండె, చర్మానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కనుక వీరు ఓపికతో, సంయమనంతో పని చేయాల్సి ఉంటుంది. కార్యాలయంలో కూడా కొన్ని సవాళ్లు ఉండవచ్చు.

కుంభ రాశి: ఈ కుంభ రాశి వారికి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడం శుభప్రదం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులు కలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంది.

మిథున రాశి: సూర్యుడు మిథునరాశిలో ఐదవ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మొగ్గు చూపుతారు. అటువంటి పరిస్థితిలో మతపరమైన కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అనేక కొత్త ఉద్యోగావకాశాలు లభించవచ్చు. వీరు సంతృప్తి చెందిన వాతావరణంలో ఉంటారు. వ్యాపారంలో కూడా చాలా లాభాలు వస్తాయి.

సూర్యుడి అనుగ్రహం కోసం చేయాల్సిన ప్రత్యేక చర్యలు ఏమిటంటే

  1. ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి పూజించండి.
  2. సూర్యుడికి బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకనే ఖచ్చితంగా సూర్యుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించండి.
  3. ఎరుపు రంగు సూర్యుని రంగు. అందువల్ల ఎర్రపువ్వులు సమర్పించండి.
  4. గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా సూర్యభగవానుడు సంతోషిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి