Sun-Mars Conjunction: కుజ, రవి గ్రహాల కలయికతో ప్రమాదం.. ఆ రాశుల వారు జాగ్రత్త..!

| Edited By: Janardhan Veluru

Dec 05, 2023 | 3:40 PM

సాధారణంగా కుజ, రవి గ్రహాలు ఎక్కడ కలిసినా ఏదో రకమైన విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో కలిసి ఉండడం వల్ల వాటికి మరింత బలం ఏర్పడింది. అందువల్ల ఇవి కొన్ని రాశులకు నష్టం కలిగించకుండా ఉండవు. ఇక్కడ రవి గ్రహం ఈ నెల 17 వరకూ కొనసాగడం జరుగుతుంది. అందువల్ల ఆ తేదీ వరకు మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

Sun-Mars Conjunction: కుజ, రవి గ్రహాల కలయికతో ప్రమాదం.. ఆ రాశుల వారు జాగ్రత్త..!
Sun Mars Conjunction
Follow us on

సాధారణంగా కుజ, రవి గ్రహాలు ఎక్కడ కలిసినా ఏదో రకమైన విధ్వంసాన్ని, వినాశనాన్ని సృష్టించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో కలిసి ఉండడం వల్ల వాటికి మరింత బలం ఏర్పడింది. అందువల్ల ఇవి కొన్ని రాశులకు నష్టం కలిగించకుండా ఉండవు. ఇక్కడ రవి గ్రహం ఈ నెల 17 వరకూ కొనసాగడం జరుగుతుంది. అందువల్ల ఆ తేదీ వరకు మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ, రవుల కలయిక జరిగినందువల్ల ఈ రాశివారికి డబ్బు నష్టం జరగడం, వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం, జీవిత భాగస్వామికి అనారోగ్యం కలగడం, మోసపోవడం వంటివి జరుగుతాయి. ఇందులో కుజుడు రాశ్యధిపతి అయినందువల్ల దుష్ఫలి తాలు తగ్గే అవకాశం ఉంది కానీ, కుజుడు, రవితో కలిసి అక్కడ ఉన్నంత కాలం జాగ్రత్తగా ఉండ డమే మంచిది. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ఈ దుష్ఫలితాలు తగ్గే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, రవులు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది కానీ, వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఎడబాటు కలగవచ్చు. లేదా జీవిత భాగస్వామి ఆధిపత్యం పెరగవచ్చు. మొత్తానికి కుటుంబ పరంగా ప్రశాంత పరిస్థితులు ఉండే అవకాశం లేదు. స్కందాష్టకం చదువుకోవడం చాలా మంచిది.
  3. మిథునం: ఈ రాశికి షష్ట స్థానంలో ఈ రెండు గ్రహాలు కలవడం అనేది వృత్తి, ఉద్యోగాలకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర వాగ్వాదాలు, వైరాలకు అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అవమాన పడే సూచనలున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం పట్టుకునే అవకాశం కూడా ఉంది. శస్త్ర చికిత్సలు జరగవచ్చు. బాగా డబ్బు నష్టం జరుగుతుంది. సుందరకాండ పారాయణం చేసుకోవడం మంచిది.
  4. కన్య: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ కలయిక జరిగినందువల్ల, వాహన ప్రమాదా లకు, విద్యుదాఘా తాలకు, అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంది. అకారణంగా మిత్రులతో, తోబుట్టు వులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. మిత్రుల్లో కొందరు ద్రోహం తలపెట్టడం జరుగుతుంది. దుస్సాహసాలకు ఒడిగట్టగం జరుగుతుంది. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో మాత్రం పురోగతి ఉంటుంది. విష్ణు సహస్ర నామం చదువుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి వ్య స్థానంలో ఈ కలయిక జరిగినందువల్ల, వాహన ప్రమాదా లకు, విద్యుదాఘా తాలకు, అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంది. అకారణంగా మిత్రులతో, తోబుట్టు వులతో విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. మిత్రుల్లో కొందరు ద్రోహం తలపెట్టడం జరుగుతుంది. దుస్సాహసాలకు ఒడిగయ స్థానంలో కుజ, రవుల కలయిక జరగడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన బంధువులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఒకటి రెండు దుర్వార్తలు అందే అవకాశం ఉంది. అనుకోకుండా వైద్య ఖర్చులు మీద పడతాయి. డబ్బు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విహార యాత్రల్లో ఇబ్బందులు పడడం కూడా జరుగుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.
  6. మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ, రవులు సంచారం చేయడం ఆకస్మిక ధన లాభానికి, విదేశీ ప్రయా ణాలకు అనుకూలంగా ఉంది కానీ, ఆస్తి నష్టం జరగడం, ముఖ్యంగా పిత్రార్జితం కోల్పోవడం, తండ్రి ఆరోగ్యం దెబ్బతినడం వంటివి జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కోర్టు కేసులు ప్రతికూలంగా మారడం జరుగుతుంది. బంధువుల నుంచి దుర్వార్తలు అందుతాయి. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.