జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశిచక్రంలో మార్పుకి ఎంత ముఖ్యముందో.. ఏదైనా ఒక రాశిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. బుధుడు, గురువు, సూర్యుడు, ఈ మూడు ప్రభావవంతమైన గ్రహాలు మీన రాశిలో కలిసి సంచరిస్తున్నారు. మార్చి 16వ తేదీ ఉదయం 10.33 గంటలకు మీనరాశిలో బుధుడు-గురువు, సూర్యుడు కలిసి ఉంటాడు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మొత్తం 12 రాశిచక్రాలు ఈ కూటమి ద్వారా ప్రభావితంకానున్నాయి. అయితే ఈ మూడు ప్రధాన గ్రహాల కూటమి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇచ్చే రాశులు కొన్ని ఉన్నాయి. మీనరాశిలో బుధుడు-సూర్యుడు, బృహస్పతి కలయిక వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఏ రాశులకు కలుగుతుందో తెలుసుకుందాం..
వృషభ రాశి:
మీ రాశిలో ఈ గ్రహాల కలయిక 11వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. మైత్రి సమయంలో, ఈ రాశికి చెందిన వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు . డబ్బు సంపాదించవచ్చు లేదా పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. చాలా ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు. మంచి ప్రయోజనాలను పొందుతారు. ఏదైనా వ్యాపారం లేదా వృత్తిలో నిమగ్నమై ఉన్నవారికి వారికి అన్ని విధాలా మేలు చేస్తుంది. రాబోయే కాలం ఉద్యోగస్తులకు ఎంతో మేలు చేస్తుంది. మంచి ఆఫర్లు అందుకుంటారు. చేపట్టిన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారి జాతక చక్రంలో ఐదవ ఇంట్లో బుధుడు, సూర్యుడు , బృహస్పతి కలయిక జరిగింది. ఈ కూటమి వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశం లభిస్తుంది. ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ కూటమి ప్రత్యేక పథకాల్లో పురోగతిని తెస్తుంది. సమాజంలో గౌరవం, సంపద పెరుగుతుంది. స్టాక్ మార్కెట్‌తో అనుబంధం ఉన్నవారికి, ఈ కలయిక వరం కంటే తక్కువ కాదు. అనేకాదు విద్యార్థులు పోటీ పరీక్షలలో చాలా మంచి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వ్యక్తుల జాతకంలో నాల్గవ ఇంట్లో మూడు ప్రధాన గ్రహాల కలయిక జరిగింది. అటువంటి పరిస్థితిలో, వీరి సౌలభ్యం, లగ్జరీలో పెరుగుదల ఉండవచ్చు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఏర్పడతాయి. ఏదో ఒక విధంగా ప్రభుత్వ రంగాలతో అనుబంధం ఉన్న వారికి సువర్ణావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందడం ద్వారా.. వీరి ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల కనిపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)