Vipreet Raj Yoga: శక్తిమంతంగా ఆరు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం..!

Zodiac Signs: ఈ నెల 13 నుంచి దాదాపు ఆరు వారాల పాటు ప్రతి గ్రహం, స్వక్షేత్రంలోనో, మిత్ర క్షేత్రంలోనో సంచారం చేయడం జరుగుతోంది. రాహు, కేతువులతో సహా మొత్తం గ్రహాలన్నీ శక్తిమంతంగా మారడం జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం, వద్దన్నా డబ్బు, ఊహించని పదవీ యోగం లభించబోతున్నాయి.

Vipreet Raj Yoga: శక్తిమంతంగా ఆరు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి విపరీత రాజయోగం..!
Vipreet Rajyoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 11, 2024 | 12:48 PM

ఈ నెల 13 నుంచి దాదాపు ఆరు వారాల పాటు ప్రతి గ్రహం, స్వక్షేత్రంలోనో, మిత్ర క్షేత్రంలోనో సంచారం చేయడం జరుగుతోంది. రాహు, కేతువులతో సహా మొత్తం గ్రహాలన్నీ శక్తిమంతంగా మారడం జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీత రాజయోగం, వద్దన్నా డబ్బు, ఊహించని పదవీ యోగం లభించబోతున్నాయి. మేషం, వృషభం, సింహం, కన్య, మకరం, కుంభ రాశుల వారు ఈ గ్రహ సంచారం వల్ల అత్యధికంగా ప్రయోజనాలు పొందబోతున్నారు.

  1. మేషం: ఈ రాశిలో కుజుడు, ధన స్థానంలో గురువు, లాభ స్థానంలో శని సంచారం ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాన్ని తీసుకు రాబోతున్నాయి. ఈ రాశివారి ఆర్థిక స్థితి తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉండడంతో పాటు అనేక మార్గాల్లో అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలకు ఆస్కారం ఉండదు.
  2. వృషభం: ఈ రాశిలో గురువు, దశమ స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో రాహువు, ధన స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఊహించని ధన యోగాలు పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయ త్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, వైభవం పెరుగుతాయి. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమై, మనశ్శాంతి ఏర్పడుతుంది.
  3. సింహం: ఈ రాశివారికి దశమ, లాభస్థానాల్లో వాటి అధిపతులే సంచారం చేయడంతో పాటు, భాగ్య స్థానం కూడా బాగా బలపడడం వల్ల ఈ రాశివారి ప్రాభవం అనూహ్యంగా పెరుగుతుంది. సంపన్నుల స్థాయి చేరిపోవడంతో పాటు, ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. జీవితం బాగా మారిపోయే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశివారికి నాలుగు గ్రహాలు స్వస్థానాల్లో అనుకూలంగా ఉండడం వల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. ప్రతిదీ తనకు అనుకూలంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీర్ఘకాలిక వివాదాలు, సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరి స్థిరపడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లాలను కుంటున్నవారి కలలు నెరవేరుతాయి. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం కలిసి వస్తుంది.
  5. మకరం: ఈ రాశివారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితం రాజయోగంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. సామాజికంగా గౌరవ మర్యా దలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగు లోకి వస్తాయి. నిరుద్యోగులకు అనూహ్యమైన ఆఫర్లు అందుతాయి. అవివాహితుల పెళ్లి ప్రయ త్నాలు సంతృప్తికరంగా ఫలిస్తాయి. ఆదాయానికి లోటుండదు. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
  6. కుంభం: ఈ రాశికి కుజ, గురు, బుధ, గురు గ్రహాలు బాగా అనుకూలంగా మారినందువల్ల ఉద్యోగంలో అధి కార యోగం పట్టడం, వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా డిమాండు పెరగడం వంటివి జరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనేక శుభ వార్తలు వింటారు. జీవితంలో ఊహిం చని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబంలో వివాహం నిశ్చయం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.