Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 11, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ రోజు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వారి అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మిథున రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి వారికి మీన రాశి వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 11th June 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 11, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 11, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ రోజు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వారి అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మిథున రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మేష రాశి వారికి మీన రాశి వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారడంతో కొద్దిగా రుణ సమస్యలు తగ్గుతాయి. పిల్లలకు చదువుల విషయంలో అనుకూలతలు పెరుగు తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగు తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో విలువైన వస్తువులు గల్లంతయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యయ ప్రయాసలున్న ప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. బాగా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. లాభాలు తక్కువగా కనిపిస్తాయి. ఆస్తి వ్యవహారాలు అను కూలంగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన పనులను పట్టు దలగా పూర్తి చేస్తారు. ఓ ముఖ్యమైన వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి జీవితం బిజీ అవుతుంది. వ్యాపారంలో లాభాలకు లోటుండదు. గృహ, వాహన యోగాలు పట్ట వచ్చు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయానికి వెడతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోవడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం జరుగు తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగి పోతాయి. పెళ్లి సంబంధం విషయంలో శుభవార్త వింటారు. తల్లితండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. నష్టాల నుంచి బయటపడడం, పోటీదార్ల బెడద తగ్గడం వంటివి చోటు చేసుకుం టాయి. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి కానీ, అధికారులు మీ సేవలను ఎక్కువగా విని యోగించుకోవడం జరుగుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు అను కున్న విధంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎటువంటి పనినైనా బాధ్యతగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించవచ్చు. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్త అందుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఇతరులకు వాగ్దానాలు చేసి, హామీలు ఉండి ఇబ్బందులు పడతారు. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు హాయిగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాల్లో ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. కాస్తంత ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు కొద్దిగా ఆశాభంగం చెందే అవ కాశం ఉంది. వ్యక్తిగత సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. వ్యాపారాల్లో పోటీ బాగా పెరుగు తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఒకేసారి అనేక ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదంలో రాజీపడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధు వుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.