Horoscope Today: ప్రయాణాల విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 12, 2024): మేష రాశి వారు స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మిథున రాశి వారు ఈ రోజు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూన్ 12, 2024): మేష రాశి వారు స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మిథున రాశి వారు ఈ రోజు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా సాగిపోతాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడి ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యమిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉండవచ్చు. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల్ని మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. అవసరానికి తగ్గట్టు డబ్బు అందుతుంది. రుణ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యు లతో ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. నిరుద్యోగులకు అనుకూల వార్తలందు తాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబ సభ్యుల నుంచి లేదా బంధువుల నుంచి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చేప ట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి అమ్మడం, కొనడం వంటి వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందవచ్చు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వ్యాపార వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నాయి. ఇంటా బయటా సాను కూల పరిస్థితులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంటికి ఇష్టమైన బంధుమిత్రులు వచ్చే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వాహనం కొనాలనే ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరు గుతుంది. కొద్ది పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందు తాయి. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యో గంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది. విద్యార్థులకు బాగాlనే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొద్దిపాటి అనారోగ్యం కారణంగా ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవ సర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా నెరవేరుతాయి. అత్యవసర వ్యవహారాలు మిత్రుల తోడ్పాటుతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపడతారు. బంధువులతో కొద్దిపాటి మాట పట్టింపులుంటాయి. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహ కరంగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
బంధుమిత్రులతో అపార్థాలు, విభేదాలు తొలగిపోయి, సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. విద్యార్థులు చదువుల మీద బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.