Shukra Gochar: శుక్రుడి అనుగ్రహం.. ఆ రాశులను అదృష్టం తలుపు తట్టబోతోంది..!

శుక్ర గ్రహం డిసెంబర్ 21 నుండి జనవరి 12 వరకు ధనూ రాశిలో సంచారం చేయనుంది. గురువు, శని గ్రహాల వీక్షణతో శుక్రుడికి బలం చేకూరి.. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఈ రాశుల వారికి ఆర్థికాభివృద్ధి, వివాహ సంబంధాలు, వృత్తి ఉద్యోగాల్లో పురోగతి, సుఖ సంతోషాలు పెరుగుతాయి.

Shukra Gochar: శుక్రుడి అనుగ్రహం.. ఆ రాశులను అదృష్టం తలుపు తట్టబోతోంది..!
Shukra Gochar

Edited By:

Updated on: Dec 16, 2025 | 6:44 PM

గ్రహాలన్నిటిలోనూ శుక్రుడు ఒక విశిష్టమైన గ్రహం. సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు రాశి మారడానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శుక్రుడు ఏ రాశివారిని అనుగ్రహిస్తే, ఏ రాశివారికి అనుకూలంగా ఉంటే ఆ రాశివారి జీవితం సుఖ సంతోషాలతో నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఈ శుక్రుడు ఈ నెల (డిసెంబరు) 21 నుంచి జనవరి 12 వరకు గురువుకు చెందిన ధనూ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ శుక్రుడిని గురువుతో పాటు, శుక్రుడికి మిత్రుడైన శని కూడా మీన రాశి నుంచి వీక్షించడం జరుగుతోంది. శుక్ర, శని, గురువుల మధ్య ఒక విధమైన లింక్ ఏర్పడడం వల్ల మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశులకు అదృష్టం తలుపు తట్టబోతోంది.

  1. మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడిని శని, గురువులు వీక్షించడం వల్ల శుక్రుడికి బలం పెరిగి మనసులోని కోరికలు, ఆశలను చాలావరకు నెరవేర్చడం జరుగుతుంది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు మటుమాయం అయి, అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా బాగా అదృష్టం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ అవకాశాలు లభిస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం, దాన్ని శని, గురు గ్రహాలు వీక్షించడం వల్ల శుక్రుడు ఈ రాశివారికి ఇంతవరకూ ఊహించని సుఖ సంతోషాల్ని అను గ్రహించడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో అనుకోకుండా ప్రేమలో పడడం గానీ, పెళ్లి కావడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి.
  3. కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడమే ఒక విశేషం కాగా, దాన్ని గురు, శనులు వీక్షించడం మరో విశేషం. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదా యం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. సొంత ఇల్లు, వాహనం అమరుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశాల్లో స్థిరత్వం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి.
  4. తుల: తృతీయ స్థానంలో ప్రవేశించిన రాశ్యధిపతి శుక్రుడిని శని, గురువులు అనుకూల స్థానాల నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారు ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించి ఈ రాశికి చెందిన సామాన్యుడు సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కలే కాక, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశిలో ఉన్న శుక్రుడిని గురు, శనులు చూడడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగి స్థితిగతులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద విజయం సాధించి బిజీగా పురోగమించడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి విస్తరిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు అపారంగా లాభిస్తాయి.
  6. కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడిని ధన స్థానం నుంచి శని, ధనాధిపతి గురువు వీక్షించడం వల్ల తప్పకుండా ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము కూడా కొద్ది ప్రయత్నంతో వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి.