నవగ్రహాల్లో శుక్రుడు స్థానం వెరీ వెరీ స్పెషల్. దాంపత్య సంతోషం, శ్రేయస్సు, ఆకర్షణ, వైభవంతో పాటు కళలకు అధిపతి. శుక్రుడు సెప్టెంబర్ 4 ఉదయం కర్కాటక రాశిలో అడుగు పెట్టనున్నాడు. అక్టోబర్ 2, 2023 ఉదయం వరకు కర్కాటకరాశిలో ఉండనున్నాడు. అనంతరం సింహరాశిలో అడుగు పెట్టి.. నవంబర్ 3 వరకు సంచరించనున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రుడి ప్రభావం ప్రతి రాశిపై ఉండనుంది. శుక్రగ్రహ సంచారం ఏ రాశివారిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
ఈ రాశి వారికి శుక్రుని సంచారం నాల్గవ ఇంట్లో జరగబోతోంది. మేష రాశి వారికి శుక్రుడు ధనానికి అధిపతి, సప్తమ గృహం కావడం వల్ల సంతోష గృహంలో శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో చర, స్థిరాస్తులు పెరిగే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పదవ ఇంటిలో శుక్ర గ్రహ సంచారంతో ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్ర గ్రహ సంచారం ఉద్యోగ, వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి రాజకీయ నాయకుల ప్రతిష్ట, అనుబంధం పెరుగుతుంది. శరీరాన్ని, మనసును, బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను పొందుతారు.
పరిహారం: స్త్రీలను గౌరవించండి.
వృషభ రాశి వారికి, శుక్రుడు లగ్నానికి అధిపతి. ఆరవ ఇంటికి, శక్తి ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుడు కుడి వైపున ఉన్నప్పుడు అదృష్టం కలుగుతుంది. అందం, వ్యక్తిత్వంలో పెరుగుదల ఉంటుంది. సౌందర్య సాధనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ విజయం సాధిస్తారు. పని చేస్తున్న ప్రదేశాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. అంతేకాదు తోబుట్టువులు, స్నేహితుల నుండి పూర్తి సహకారం, గౌరవం పొందుతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. శత్రువులు కుట్రలు చేయవచ్చు కానీ మీపై ఆధిపత్యం చెలాయించలేరు. అంతిమంగా విజయం మీదే అవుతుంది.
పరిహారం: లక్ష్మీదేవికి దానిమ్మపండును నైవేద్యంగా సమర్పించండి.
మిథునరాశి వారికి ఐదవ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు రెండవ ఇంటిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు సరైన దిశలో ఉన్నప్పుడు మిథున రాశి వారికి ఆహార పానీయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ రాశికి చెందిన వారు డయాబెటిక్ పేషెంట్ అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. తినే ఆహారం, పానీయాల పట్ల నియంత్రణ కలిగి ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశాలున్నాయి. అధికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అనుకోని అతిథులకు ఆతిధ్యం ఇవ్వాల్సి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పిల్లల ద్వారా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది.
పరిహారం: దుర్గాదేవి గుడిలో నెయ్యి దీపం వెలిగించండి.
కర్కాటక రాశి వారికి నాల్గవ, పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు లగ్న రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు సంచారంతో ఈ రాశివారు వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అనవసర ఖర్చులను నివారిస్తారు. వైవాహిక జీవితంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మద్దతు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం క్షీణిస్తే.. అది మెరుగుపడుతుంది. ఆస్తిని కొనాలనే ప్రయత్నాలు నెరవేరే అవకాశము ఉంది. ప్రయాణంతో మంచి ప్రయోజనాలను పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు.
పరిహారం: మంచి ప్రవర్తనను కొనసాగించండి.
సింహ రాశి వారికి దశమి, తృతీయ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు బయటి ఇంట్లో సంచరించనున్నాడు. శుక్రుడు సంచరిస్తున్నప్పుడు, బహుళజాతి కంపెనీలో ఆన్‌లైన్ లేదా బ్యాంకింగ్ పనులతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వినోదం, విలాసాల కోసం ఖర్చులు చేస్తారు. అదే సమయంలో, డబ్బు, బహుమతులను అందుకుంటారు. వివాదాస్పద పరిస్థితుల్లో చిక్కుకోకుండా దూరంగా ఉండటం మంచిది.
పరిహారం: లక్ష్మీ దేవి ఆలయంలో తామర పువ్వును సమర్పించండి.
కన్యా రాశి వారికి శుక్రుడు, సంపద, అదృష్టానికి అధిపతిగా, లాభదాయకమైన ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొంతకాలంగా పెడుతున్న అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమను వ్యక్తీకరించడానికి శుభ సమయం. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంగీతం, కళ లేదా ఏదైనా సృజనాత్మక పనికి సంబంధించిన వ్యక్తులకు శుక్రుడు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల ద్వారా గౌరవాన్ని పొందుతారు.
పరిహారం: గణపతి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించి, శనగపిండి లడ్డూలను సమర్పించండి.
తులారాశి వారికి శుక్రుడు లగ్నానికి అధిపతి. ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తున్నాడు. తుల రాశి వారికి శుక్రుని సంచారం మరింత ప్రయోజనకరంగా ఉంది. శుక్రుని సంచారంతో ఈ పని చేస్తున్న ప్రదేశంలో కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే రీసెర్చ్, ఎల్‌ఐసి, ఆర్కియాలజీ, సిబిఐ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు శుక్ర సంచారం ప్రయోజనాలను కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్థిరాస్థులు, చరాస్తులను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, కొంత సమయం వేచి ఉండండి లేదా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోండి.
పరిహారం: స్త్రీలను గౌరవించండి.
వృశ్చిక రాశి వారికి శుక్రుడు బయటి, ఏడవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. శుక్రుడు అదృష్ట గృహంలో సంచరించనున్నాడు. శుక్రుడు కుడి వైపున ఉండడంతో లక్కీ వీరి సొంతం. కొంతకాలంగా ఎదురవుతున్న ఆకస్మిక, అనవసరమైన సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి కలుగుతుంది. ముఖ్యంగా దిగుమతి-ఎగుమతి లేదా ఏదైనా విదేశీ కంపెనీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఖర్చులు పెరుగుతాయి. తమ్ముళ్ల మద్దతు లభిస్తుంది. స్త్రీ సాంగత్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.
పరిహారం: ఉదయాన్నే లక్ష్మీ నారాయణుని ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు రాశి వారికి ఆరు, పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచరించనున్నాడు. ఆరోగ్యం సమస్యాత్మకంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు డయాబెటిక్ పేషెంట్ అయితే.. శారీరక ఇబ్బందులు కలుగుతాయి. అధిక ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అత్తమామలతో సమస్యలు తలెత్తవచ్చు. ఆహారం, పానీయాలపై ప్రత్యేక నియంత్రణ అవసరం. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి.. లేకుంటే వీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఫలితం వస్తుంది.
పరిహారం: ఈ సంచార కాలంలో ప్రతిరోజూ దుర్గాదేవి ఆలయంలో దీపం వెలిగించండి.
మకర రాశి వారికి ఐదవ, పదవ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు ఏడవ ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుని సంచారం వల్ల ఆరోగ్యం, అనవసర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుక్ర సంచారం వైవాహిక జీవితానికి, వ్యాపారానికి చాలా మంచిది. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. వ్యాపారంలో కొత్త మార్గాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది.
పరిహారం: స్త్రీలను గౌరవించండి.
కుంభ రాశి వారికి శుక్రుడు, నాల్గవ , తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఆరవ ఇంటిలో సంచరిస్తున్నాడు. శుక్రుని సంచారంతో శత్రువులు పెరుగుతారు. మీ నడవడిక ఆలోచనతో ప్రతి సమస్య నుండి బయటపడతారు. ఉద్యోగస్థులు శుభఫలితాలను అందుకుంటారు. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే .. విజయాన్ని అందుకునే అవకాశం ఉంది. రుణం కోసం ప్రయత్నించే వ్యక్తులు విజయం సాధిస్తారు.
పరిహారం: మీ తల్లిదండ్రులకు సేవ చేయండి.
మీన రాశి వారికి శుక్రుడు, శౌర్యానికి అధిపతి.. శుక్రుడు ఎనిమిదవ ఇంటికి, ఐదవ ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుడు సంచారంతో ఈ రాశి వ్యక్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇతరులతో గొడవ పడే విధంగా ప్రవర్తించకండి. ఆలోచనలు అదుపులో ఉండేలా చూసుకోండి. ప్రేమ విషయంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీ పై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోండి. పిల్లల నుండి కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. కన్సల్టెన్సీ, పరిశోధనా రంగాల్లో ఉన్న వ్యక్తులకు శుక్రుడి సంచారం వలన శుభఫలితాలను ఇస్తుంది.
పరిహారం: మతపరమైన కార్యక్రమాలతో సన్నిహితంగా ఉండండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)