Horoscope Today: ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు.. శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today (02nd Sep): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం (సెప్టెంబరు 2న) 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

Horoscope Today: ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు.. శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today 2nd September 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 02, 2023 | 5:05 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు లేదా నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తల పెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా పుంజుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. ఆరోగ్యానికేమీ భంగం ఉండదు. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం ‍సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిధి విస్తరించే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి బాధ్యతలను నెరవేరుస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. తల్లితండ్రులు మీ దగ్గరికి వస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆదాయం బాగానే పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయా ణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అను కూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు బాగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. జీవిత భాగస్వామితో షాపింగ్ చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): బంధువుల నుంచే కాక, సన్నిహితుల నుంచి కూడా ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులు కొందరిని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకా శాలు అందివస్తాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దూరపు బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చ యం అవుతుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు న్నాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపో తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): మంచి శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలో బాగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కే సూచనలున్నాయి. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): స్థిరాస్తి వ్యవహారం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ పెద్దల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ప్రయత్నాలు సకాలంలో పూర్తయి, సత్ఫలితాలనిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో కూడా సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల్లో చదువుల పట్ల బాగా శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి సమస్య ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వివిధ రంగాలకు చెందిన వారికి ఆదాయం పెరు గుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం లేదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ప్రాధాన్యం పెరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. దానధర్మాలు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇంటా బయటా మీ ఆలోచనలకు, సలహా లకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడ తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలో అంచనాలను అందు కుంటారు. ఉద్యోగంలో సిబ్బంది నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయం నిలకడగా ఉండటం, ఆదాయ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి జరిగినప్పటికీ, ఖర్చుల్ని అదుపు చేయడం మాత్రం బాగా కష్టమవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆపర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తి గత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మనసులోని ఒకటి రెండు కోరి కలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపో తుంది.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.