Success Horoscope
శుభ గ్రహాల అనుకూలతల వల్ల ఆరు రాశుల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తమ ఆశయాలు, ఆశలు, కోరికలను సఫలం చేసుకోబోతున్నారు. ఈ ఏడాది చివరి లోగా తాము అనుకున్నది సాధించే రాశుల్లో వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 31లోగా ఈ రాశుల వారికి యత్న కార్యసిద్ధి, వ్యవహార జయం కలగబోతున్నాయి. శుభ గ్రహాలతో పాటు రవి, శని గ్రహాలు కూడా అనుకూలంగా మారబోతున్నందువల్ల వీరి ప్రయత్నాలన్నీ విజయవంతం కావడంతో పాటు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంది.
- వృషభం: ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడంలో దిట్టలైన వృషభ రాశివారు ఈ ఏడాది ధన సంపాదన మీద దృష్టి సారించే అవకాశం ఉంది. అతి జాగ్రత్తగా వ్యవహ రించి, తమకు రావలసిన డబ్బును రాబట్టుకోవడంతో పాటు ఆచితూచి ఖర్చు పెట్టడం, ప్రతి రూపాయిని కూడబెట్టుకోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద అత్యధికంగా శ్రమను వెచ్చించే అవకాశం ఉంటుంది. కొద్ది కష్టంతో బ్యాంక్ నిల్వలను పెంచుకోవడం జరుగుతుంది.
- మిథునం: భవిష్యత్తు మీద ఎప్పుడూ దృష్టి పెట్టి ఉండే ఈ రాశివారు అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. పొదుపు పాటించడం, మదుపు చేయడమే ధ్యేయంగా వీరి ఆదాయ ప్రయత్నాలు పురోగతి చెందుతాయి. ప్లాన్లు వేయడంలో సిద్ధహస్తులైన ఈ రాశివారు రహస్యంగా డబ్బు దాచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తిపాస్తులు కూడగట్టుకోవడంలో, ఆస్తి వివాదా లను పరిష్కరించుకోవడంలో కూడా వీరు అత్యధికంగా చొరవ చూపించడం జరుగుతుంది.
- కన్య: ఈ రాశివారు కూడా తమ అదనపు సంపాదనను రహస్యంగా దాచేసే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడంలో నిష్ణాతులైన ఈ రాశివారు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు చిన్న వ్యాపారాల్లో కూడా మదుపు చేసే అవకాశం ఉంటుంది. అద నపు ఆదాయం కోసం రాత్రింబగళ్లు కష్టపడడానికి కూడా వీరు సిద్ధపడే అవకాశం ఉంది. రావల సిన సొమ్మును, బాకీలను, బకాయిలను గట్టి పట్టుదలతో రాబట్టుకుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు.
- తుల: ఈ ఏడాది ఈ రాశివారి ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ధన సంపాదనతో పాటు, ఆస్తి పాస్తులు సమకూర్చుకోవడం, గృహ, వాహన సౌకర్యాలను ఏర్పరచుకోవడం వంటి వాటి మీద కూడా దృష్టి సారిస్తారు. ఎటువంటి వ్యవహారాన్నయినా వ్యాపార దృష్టితో చూసే ఈ రాశివారు ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ సరికొత్త మార్పులు చేపట్టి ఆదాయాన్ని పెంచుకునే అవ కాశం ఉంది. ఒకపక్క జీవితాన్నిమెరుగుపరచుకుంటూనే మరోపక్క భవిష్యత్తుకు పునాది వేసుకుంటారు.
- మకరం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు ఉన్నందువల్ల ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కు వగా ఉంటుంది. అనవసర ఖర్చులను బాగా తగ్గించుకుంటారు. ప్రతి రూపాయిని మదుపు చేయడం జరుగుతుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకోవడం, ఆచితూచి ఖర్చు చేయడం, పొదుపు చేయడం జరుగుతుంది. ఈ ఏడాది చివరి లోగా సొంత ఇల్లుతో పాటు ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.
- కుంభం: సాధారణంగా సంపాదన విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే ఈ రాశివారు తమకు రావలసిన డబ్బు, బాకీలు, బకాయిల విషయంలో మరింత జాగ్రత్తగా, పట్టు దలగా వ్యవహరించే అవకాశం ఉంది. తప్పకుండా తమ జీవితాశయాలను సాధించుకుంటారు. ఆదాయం విషయంలోనే కాకుండా అధికారం విషయంలో కూడా ఈ రాశివారు తమ ప్రయత్నా లను ముమ్మరం చేయడం జరుగుతుంది. కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకున్నది సాధిస్తారు.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి