శ్రావణ పుత్రద ఏకాదశి 2026: ఈ పరిహారాలతో శ్రీహరి అనుగ్రహం.. ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి మీ సొంతం!

Shravan Putrada Ekadashi 2026: ఆగస్టు 23న శ్రావణ పుత్రద ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున రాశి ప్రకారం ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహం లభించి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఏకాదశి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం..

శ్రావణ పుత్రద ఏకాదశి 2026: ఈ పరిహారాలతో శ్రీహరి అనుగ్రహం.. ఐశ్వర్యం, ధనధాన్య వృద్ధి మీ సొంతం!
Shravan Putrada Ekadashi 2026

Updated on: Aug 20, 2026 | 12:30 PM

శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పవిత్రమైన ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి (Shravan Putrada Ekadashi) గా జరుపుకుంటారు. ఆగస్టు 23న పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ రోజు ప్రధానంగా శ్రీమహావిష్ణువును పూజిస్తారు. భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా తమ రాశికి అనుగుణంగా కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. మరి ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారు ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు గంగాజలంతో అభిషేకం చేసి, పసుపు రంగు చందనం సమర్పించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు ‘ఓం నమో నారాయణాయ నమః’ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ జపం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

మిథున రాశి

మిథున రాశి వారు శ్రీహరికి బేసన్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం భక్తితో విష్ణుమూర్తిని పూజించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు పుష్పాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా శ్రీహరి కృప లభిస్తుందని నమ్మకం.

సింహ రాశి

సింహ రాశి వారు విష్ణుమూర్తికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి, పంచామృతంతో అభిషేకం చేయాలి.

కన్య రాశి

కన్య రాశి వారు శ్రీహరికి పసుపు రంగు చందనం సమర్పించాలి. భక్తితో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు లభిస్తాయి.

తుల రాశి

తుల రాశి వారు పచ్చి పాలు, గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి, అనంతరం విధివిధానాలతో పూజ చేయాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు పెరుగు, తేనెతో శ్రీమహావిష్ణువుకు అభిషేకం చేసి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ మంత్రాన్ని జపించాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు విష్ణుమూర్తికి పసుపు రంగు పుష్పాలు, పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.

మకర రాశి

మకర రాశి వారు శ్రావణ పుత్రద ఏకాదశి రోజున విష్ణు చాలీసా పారాయణం చేయాలి. శ్రీహరి అనుగ్రహం కోసం భక్తితో పూజ చేయడం మంచిదని చెబుతారు.

కుంభ రాశి

కుంభ రాశి వారు విష్ణుమూర్తికి బెల్లం, శనగపప్పును నైవేద్యంగా సమర్పించి, పూజలో పసుపు కొమ్మును అర్పించాలి.

మీన రాశి

మీన రాశి వారు ‘ఓం విష్ణవే నమః’ మంత్రాన్ని జపించాలి. భక్తిశ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని విశ్వాసం.

(గమనిక: ఇవి జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా సూచించే పరిహారాలు మాత్రమే. వీటి ఫలితాలకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు)

Loading...
Unable to load recommendations.
Follow Us