AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Jayanti 2026: శనీశ్వరుడి కటాక్షానికి గొప్ప అవకాశం.. ఈ పరిహారాలతో అదృష్టం..!

Lord Shani Dev: శని దోషంతో ఇబ్బందులు పడుతున్న వారికి మే 16న వచ్చే శని అమావాస్య ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. శని జయంతి కూడా ఇదే రోజున రావడం విశేషం. ఈ పర్వదినాన శని దేవుడికి ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేసి నువ్వులు లేదా మినుములు దానం చేయడం ద్వారా శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కష్టాల నుంచి బయటపడి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది.

Shani Jayanti 2026: శనీశ్వరుడి కటాక్షానికి గొప్ప అవకాశం.. ఈ పరిహారాలతో అదృష్టం..!
Lord Shani Dev Blessings
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2026 | 11:04 AM

Share

శని దోషంతో గత కొద్ది కాలంగా ఇబ్బందులు, కష్టనష్టాలు పడుతున్న రాశులు ఈ శని బాధ నుంచి బయటపడడానికి మరో విశేషమైన అవకాశం వచ్చింది. ఈ నెల(మే) 16న శనివారం రోజున అమావాస్య సంభవిస్తోంది. పైగా ఇది శని జయంతి నాడు చోటు చేసుకుంటోంది. శని అమావాస్య అని వ్యవహరించే ఈ అమావాస్య రోజున శనిని పూజించడం, ప్రార్థించడం, శనికి ప్రదక్షిణలు చేయడం, నువ్వులు, మినుములు దానాలు చేయడం వంటివి చేసే పక్షంలో ప్రస్తుతం శని దోషం అనుభవిస్తున్న మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి శని దోషం నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి శని వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. శని జయంతి రోజున శనికి ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయించడం వల్ల ఈ రాశివారికి ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు, వ్యవహారాలన్నీ పూర్తయి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అయి, ఆస్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వెంటనే అందుతాయి. బాకీలు వసూలవుతాయి.
  2. సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది. ఈ రాశివారు శని అమావాస్య రోజున తప్పనిసరిగా నువ్వులు, మినుములు దానం చేయడం మంచిది. దీని వల్ల వీరికి త్వరలో వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం, ఒత్తిడి, వేధింపులు వంటివి పూర్తిగా తగ్గిపోయి, ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను పొందగలుగుతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి.
  3. కన్య: ప్రస్తుతం సప్తమ శని దోషం కారణంగా అనేక విధాలుగా కష్టనష్టాలకు లోనవుతున్న ఈ రాశివారు ఈ శని జయంతి రోజున శివార్చనతో పాటు శనికి తైలాభిషేకం చేయించడం వల్ల శుభాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆస్తి, కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. శని అమావాస్య రోజున శనికి ప్రదక్షిణలు చేయడంతో పాటు నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం వల్ల శని దోషం పరిహారమవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందు తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగాలు సంపాదిస్తారు.
  5. కుంభం: ప్రస్తుతం ఏలిన్నాటి శని ప్రభావం వల్ల అష్టకష్టాలు అనుభవిస్తున్న ఈ రాశివారు శని జయంతి రోజున శని పూజ, శివార్చన చేయించడం వల్ల వీరిని సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. వివాదాలు, సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పని చేపట్టినా సఫలమవుతుంది. మనసులోని కోరి కలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  6. మీనం: ప్రస్తుతం ఏలిన్నాటి శని ప్రభావంలో ఉన్న ఈ రాశివారు శని జయంతి రోజున తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేయించడం మంచిది. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల్లో ఉన్నవారికి ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us