AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలై 21 రాశిఫలాలు: వారికి ధనలాభం.. వీరికి ఉద్యోగంలో శుభవార్తలు..!

Horoscope Today (July 21, 2026): ఈ రోజు మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉండగా, మిథున రాశి వారికి ధనలాభ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూలై 21 రాశిఫలాలు: వారికి ధనలాభం.. వీరికి ఉద్యోగంలో శుభవార్తలు..!
Rashi Phalalu 21 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 21, 2026): మేష రాశి వారు ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. వృషభ రాశి వారు అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. పలుకుబడి విస్తరిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు, వివాదాలు చాల వరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులు చదువులు, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ, సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. తలపెట్టిన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు తమ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనవ సర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో బాగా దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లే‌ష)

వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల బాధ్యతల్ని కూడా పంచుకోవడం జరుగుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక లావా దేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అను కూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కొందరు మిత్రుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, సానుకూలంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపో తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలువింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. వ్యాపా రాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహా రాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ గురించి ఆలోచనలు సాగిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవ కాశం ఉంది. ఆర్థికపరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పెండింగ్ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదో పవాదాలకు దిగవద్దు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. తోబుట్టువులు, బంధువులతో ఆస్తి వివాదానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగతి చెందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. చిన్న నాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

Follow Us
బడ్జెట్ ధరలో 'ఫైర్-బోల్ట్' స్మార్ట్‌వాచ్ విశేషాలివే
బడ్జెట్ ధరలో 'ఫైర్-బోల్ట్' స్మార్ట్‌వాచ్ విశేషాలివే
రైలు ప్రయాణంలో TTE మీతో దురుసుగా ప్రవర్తిస్తే ఎలా ఫిర్యాదు చేయాలి
రైలు ప్రయాణంలో TTE మీతో దురుసుగా ప్రవర్తిస్తే ఎలా ఫిర్యాదు చేయాలి
బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు? దాని మెరుపువెనుక ఉన్న రహస్యం ఇదే
బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు? దాని మెరుపువెనుక ఉన్న రహస్యం ఇదే
జూలై 21 రాశిఫలాలు: వారికి ధనలాభం.. వీరికి ఉద్యోగంలో శుభవార్తలు..!
జూలై 21 రాశిఫలాలు: వారికి ధనలాభం.. వీరికి ఉద్యోగంలో శుభవార్తలు..!
కొత్త వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను త్వరగా ఎలా బుక్ చేసుకోవాలి
కొత్త వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను త్వరగా ఎలా బుక్ చేసుకోవాలి
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?