Astrology Remedies: శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!

Saturn Rahu Ketu remedies: శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల జీవితంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అయితే ఈ గ్రహాలకు తగిన పరిహారాలు చేయడం ద్వారా అడ్డంకులు తొలగి పనులు సాఫీగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని రాశులవారు ఈ పరిహారాల వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది.

Astrology Remedies: శని, రాహు, కేతువుల ఎఫెక్ట్.. ఈ పరిహారాలతో వారికి విజయం పక్కా..!
Astrology Remedies

Edited By:

Updated on: May 05, 2026 | 6:22 PM

Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం శని, రాహు, కేతువులు సహజసిద్ధంగా ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు సృష్టించే గ్రహాలు. ఏ పనినీ ఇవి తేలికగా, సాఫీగా పూర్తి కానివ్వవు. వీటిని స్తుతిస్తే తప్ప ఇవి అడ్డంకులు తొలగించవు. స్తుతించడమంటే పరిహారాలు చేయడం. ఇందులో ఏ గ్రహం ఇబ్బంది పెడితే ఆ గ్రహానికి పరిహారం చేయించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మేషం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులవారు శని, రాహు కేతువుల స్థితిగతులను బట్టి పరిహారాలు చేయించడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ కావడం, మార్గం సుగమం కావడం వంటివి జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఉద్యోగ ప్రయత్నాలకు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు తరచూ ఆటంకాలు సృష్టిస్తుంటాడు. కాలయాపనకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి, కొత్త ఉద్యోగం రావడానికి, ఉద్యోగం మారడానికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ కావాలన్న పక్షంలో ఈ రాశివారు శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం, తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది.
  2. సింహం: ఈ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు, శని అష్టమంలో ఉండడం వంటి కారణాల వల్ల డిసెంబర్ వరకు వీరికి ఏదీ ఒక పట్టాన కలిసి రాదు. ఏ పనీ, ఏ ప్రయత్నమూ ఒక పట్టాన నెరవేరే అవకాశం ఉండదు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉండదు. అభివృద్ధి కుంటుబడుతుంది. పురోగతికి మార్గం సుగమం కావాలన్న పక్షంలో వీరు నిత్యం విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది.
  3. ధనుస్సు: ఈ రాశికి శనీశ్వరుడు నాలుగవ స్థానంలో సంచారం చేయడం, ఈ రాశి మీద శని దృష్టి ఉండడం వల్ల ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. ప్రతిభా పాటవాలకు విలువ, గుర్తింపు లేకుండా పోతాయి. ఉద్యోగంలో పదోన్నతి ఆగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వీరు మరి కొంత కాలం శనిని సంతృప్తిపరచాల్సి ఉంటుంది. తరచూ శివార్చన చేయించడంతో పాటు, శనికి ప్రదక్షిణలు, తైలాభిషేకం, నలుపు రంగు దుస్తులు ధరించడం వంటివి చేయాల్సి ఉంటుంది.
  4. మకరం: ఈ రాశికి ధన స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు సంచారం వల్ల ప్రతి ప్రయత్నం లోనూ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అతి కష్టం మీద ఆదాయం కొద్దిగా పెరగడం, రావలసిన డబ్బు రాకపోవడం, మొండి బాకీలు పెరగడం, సహాయం పొందినవారు ముఖం చాటేయడం, అప్పు చేయాల్సి రావడం వంటివి చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు తరచూ గణపతి స్తోత్రం, దుర్గాదేవి స్తోత్రం పఠించడం మంచిది. ఆదాయ వృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
  5. కుంభం: ఈ రాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, ఏలిన్నాటి శని దోషం వల్ల ఈ రాశివారు ఆదాయ పరంగానూ, కుటుంబపరంగానూ ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఎంత కష్టపడ్డా ఆశించిన ఆదాయం చేతికి అందకపోవచ్చు. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఇది కాక, జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. వీరు శనికి ప్రదక్షిణలు, శివార్చన, విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.
  6. మీనం: ఈ రాశిలో శని, వ్యయ స్థానంలో రాహువు, షష్ట స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో బాగా మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంటుంది. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. ఎంత ప్రయత్నించినా రుణ బాధ తగ్గే అవకాశం ఉండదు. సన్నిహితుల వల్ల, బంధుమిత్రుల వల్ల తరచూ మోసపోవడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమ స్యలు వృద్ధి చెందుతాయి. ఈ రాశివారు నిత్యం దుర్గాదేవి స్తోత్రం, శివస్తోత్రం పఠించడం మంచిది.

(ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us