Saturday Shani Puja: శనివారం ఈ వస్తువులను దానం చేయండి.. శని దోషం తొలగి.. కోరిన కోర్కెలు తీరతాయి..

|

Jun 10, 2023 | 7:37 AM

శని దేవుడికి కోపం తెప్పించే పనులను చేయరాదు. శనివారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా శని దేవుడు సంతోషంగా ఉంటాడని హిందూ మత గ్రంథాలలో నమ్మకం ఉంది. కొన్ని దానాలు చేయడం వలన శనిదేవుడు సంతోషిస్తాడు..తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు.

Saturday Shani Puja: శనివారం ఈ వస్తువులను దానం చేయండి.. శని దోషం తొలగి.. కోరిన కోర్కెలు తీరతాయి..
Lord Shaniswara
Follow us on

సనాతన హిందూ ధర్మంలో శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. శనివారం నాడు శనిదేవుడిని పూజించి..  కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు కర్మ ప్రదాత అని న్యాయ దేవుడు అని భావిస్తారు. శని భగవానుడు కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడని నమ్ముతారు. శనిదేవుడు ఒక వ్యక్తిపై చెడు ప్రభావాన్ని చూపితే, అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

అందుకనే శని దేవుడికి కోపం తెప్పించే పనులను చేయరాదు. శనివారం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా శని దేవుడు సంతోషంగా ఉంటాడని హిందూ మత గ్రంథాలలో నమ్మకం ఉంది. కొన్ని దానాలు చేయడం వలన శనిదేవుడు సంతోషిస్తాడు..తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు. అప్పుడు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.. ఈ నేపథ్యంలో ఈ రోజు శనివారం శనీశ్వరుడి అనుగ్రహం కోసం చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం..

శనీశ్వరుడికి అనుగ్రహం కోసం చేయాల్సిన దానాలు..  

ఇవి కూడా చదవండి

నల్ల నువ్వులు : శనివారాల్లో నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా శని దేవుడు ప్రసన్నుడని, రాహు-కేతు దోషం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం.

ఇనుము : శనివారం నాడు ఇనుము వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో శనిదోషం తొలగిపోతుంది.

బూట్లు  – చెప్పులు : శనివారం రోజున నలుపు రంగు బూట్లు లేదా చెప్పులు దానం చేయడం ద్వారా శనీశ్వరుడు ప్రసన్నుడవుతాడు. వీటిని దానం చేయడం వలన చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.

నవ ధాన్యాలు : శనీశ్వరుడు ఏలి నాటి శని, శని దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి, గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, నల్ల మినుములు, నువ్వులు, బార్లీ మొదలైన ఏడు రకాల ధాన్యాలను శనివారం దానం చేయాలి. ఈ రోజున అవసరమైన వారికి ధాన్యాలు దానం చేయడం వల్ల శని దోషం తొలగుతుంది విశ్వాసం.

నీలం రంగు పూలు: శనివారాల్లో నీలిరంగు పూలు అంటే అపరాజిత, నలుపు రంగు పుష్పాలను దానం చేయడం వల్ల శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని మత విశ్వాసం. శనివారం నాడు శని దేవుడికి శంఖ పుష్పాలు  సమర్పించడం ద్వారా కష్టాలు తీరుతాయని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).