హిందూ మతంలో వారంలోని ఒకొక్క రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. అదేవిధంగా శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. శనీశ్వరుడు కర్మ ఫలదాత అని అంటారు. మంచి పనులు చేసే వారిని శనీశ్వరుడు ఆశీర్వదిస్తాడు. చెడు పనులు చేసే వారిపై శనీశ్వరుడు ఆగ్రహాన్ని చూపిస్తాడు. అంతేకాదు ఎవరి జాతకంలోనైనా ఏలి నాటి శని, శని దోషం వంటివి ఉంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటిని నివారించడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి. ఇలా చేయడం ద్వారా జీవితంలో సంతోషాన్ని పొందుతాడు. కష్టాలు ఇంటి నుంచి శాశ్వతంగా దూరమవుతాయి.
హిందూ మతంలో రావి చెట్టును అత్యంత పవిత్రమైన చెట్టుగా భావించి పుజిస్తారు. శనివారం రోజున సూర్యోదయానికి ముందు రావి చెట్టును పూజించి, దానికి నీరు సమర్పించి, ఆవనూనె దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ నివారణ చర్యల ద్వారా శనీశ్వరుడు ఆశీర్వాదంతో సుఖ శాంతులతో జీవిస్తాడు.
ఇంట్లో ఎప్పుడూ సమస్యలు ఉంటె శనివారం రోజున శనగపిండి, గోధుమపిండిని కలిపి ఆ పిండితో చేసిన రోటీని ఆవుకు పెట్టండి. ఈ పిండి తో చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వివాదాలు, గొడవలు తొలగిపోతాయని నమ్మకం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం శనివారం రోజున శనీశ్వరుడి ముందు వెలిగించే దీపం ఆవాల నూనె, కొన్ని లవంగాలు వేసి వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు. దీనివల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది.
నల్ల కుక్కను శనీశ్వరుడు వాహనంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం నల్ల కుక్కకు ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వలన శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఇది శని దోషం నుండి ఉపశమనం కలిగిస్తుందని.. తీసుకున్న రుణం తీర్చి అప్పుల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.