Astrology: పరివర్తన యోగంతో ఆ రాశుల వారికి సకల శుభాలు..! అందులో మీ రాశి ఉందా..?

Parivartan Yoga: కుజ, చంద్ర గ్రహాల మధ్య ఈ నెల 14, 15, 16 తేదీల్లో పరివర్తన జరుగుతోంది. కుజుడికి చెందిన మేష రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడి సంచారం వల్ల ఈ శుభ పరి వర్తన యోగం ఏర్పడింది. సాధారణంగా కుజ, చంద్రులు కలిసినా, చూసుకున్నా, పరివర్తన చెందినా ఆదాయ వృద్ధికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.

Astrology: పరివర్తన యోగంతో ఆ రాశుల వారికి సకల శుభాలు..! అందులో మీ రాశి ఉందా..?
Parivartan Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 12, 2024 | 7:06 PM

Telugu Astrology: ఈ నెల 14, 15, 16 తేదీల్లో కుజ, చంద్ర గ్రహాల మధ్య పరివర్తన జరుగుతోంది. కుజుడికి చెందిన మేష రాశిలో చంద్రుడు, చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడి సంచారం వల్ల ఈ శుభ పరి వర్తన యోగం ఏర్పడింది. సాధారణంగా కుజ, చంద్రులు కలిసినా, చూసుకున్నా, పరివర్తన చెందినా ఆదాయ వృద్ధికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సంపాదన పెంచుకోవడం, ఆస్తి వివాదా లను పరిష్కరించుకోవడం, ఆస్తిపాస్తులు పెరగడం, డబ్బు మదుపు చేయడం వంటివి ఈ రెండు గ్రహాల పరివర్తన ప్రధాన లక్షణాలు. దీని వల్ల మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఇది తప్పకుండా శుభ ఫలితాలనిస్తుంది. దీని ప్రభావం ఆ తర్వాత కూడా వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

  1. మేషం: రాశినాథుడైన కుజుడితో చతుర్థ స్థానాధిపతి అయిన చంద్రుడికి పరివర్తన జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవంతో పాటు, ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సాను కూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించి లాభం కలుగు తుంది. సామాజికంగా హోదా, స్థాయి పెరుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి.
  2. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి దశమాధిపతి కుజుడితో పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగం ద్వారా ధన లాభం కలుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం పొందుతారు. మరింతగా ఆదాయావకాశాలు ఉన్న ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఏదో ఒక రూపంలో తప్పకుండా సంపద పెరగ డంతో పాటు భూలాభం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విజృంభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది.
  3. తుల: ఈ రాశికి సప్తమ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి కుదరడం గానీ జరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెంది షేర్లు, స్పెక్యులేషన్లు, భాగస్వామ్య వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలను చురుకుగా సాగిస్తారు. వాహన యోగం పడుతుంది.
  4. వృశ్చికం: రాశినాథుడైన కుజుడికి భాగ్యాధిపతి చంద్రుడితో పరివర్తన జరిగినందువల్ల విపరీతంగా ఆదాయం కలిసి వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి గానీ, సంపద గానీ కలిసి వస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి.
  5. మకరం: ఈ రాశికి చతుర్థ, సప్తమాధిపతుల పరివర్తన జరగడం వల్ల తప్పకుండా భూలాభం కలుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఇతర దేశాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. ఒకటి రెండు ధన యోగాలు పట్టడం జరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి ధన, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం నెరవేరే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు తప్పకుండా లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు తదితర లావాదేవీల్లో పెట్టు బడులు పెట్టి లాభాలు పొందడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితి, స్థాయి పెరిగే సూచనలున్నాయి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..