Shubha Yoga: పరమ శుభ గ్రహంగా రాహువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువుని పరమ పాప గ్రహంగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం రాహువు పరమ శుభ గ్రహంగా మారడం జరుగుతోంది. గురువుకు చెందిన మీన రాశిలో రాహువు సంచారం చేయడం, శుభ గ్రహాలైన ఉచ్ఛ శుక్రుడు, బుధుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాహువు గుణగణాలు పూర్తిగా మారిపోయి శుభ గ్రహంగా మారుతుంది. దీంతో రాహువు కొన్ని రాశుల వారికి అనేక శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుగ్రహించనున్నాడు.

Shubha Yoga: పరమ శుభ గ్రహంగా రాహువు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!
Rahu Graha Positive Impact

Edited By:

Updated on: Feb 25, 2025 | 7:45 PM

Rahu’s Positive Impact: జ్యోతిషశాస్త్రం ప్రకారం పరమ పాప గ్రహమైన రాహువు ప్రస్తుతం పరమ శుభ గ్రహంగా మారడం జరుగుతోంది. గురువుకు చెందిన మీన రాశిలో సంచారం చేయడం, శుభ గ్రహాలైన ఉచ్ఛ శుక్రుడు, బుధుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాహువు గుణగణాలు పూర్తిగా మారిపోవడం జరుగుతోంది. మే 18న మీన రాశి నుంచి కుంభ రాశిలోకి మారబోతున్న రాహువు ఈ రెండున్నర నెలల పాటు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారికి అనేక శుభ ఫలితాలను, శుభ యోగాలను అనుగ్రహించే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న రాహువు సాధారణంగా డబ్బు నష్టం, వైద్య ఖర్చులు, నమ్మక ద్రోహాలు, మోసాలు, తిప్పట వంటి అవయోగాలు కలిగించే అవకాశం ఉంది. అయితే, ఫిబ్రవరి 28 నుంచి శుభ గ్రహాల సాంగత్యం ఏర్పడుతున్నందువల్ల తప్పకుండా ధనార్జనను పెంచడం, వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడం, అనారోగ్యాల నుంచి కోలుకోవడం, వైద్య ఖర్చులు తగ్గడం, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం, విదేశాలకు వెళ్లడం, కార్యసిద్ధి, వ్యవహార జయం వంటివి జరిగే అవకాశం ఉంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగంలో అధికారులు వేధించడం, సహచరులు సహకరించకపోవడం, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, పేరు ప్రఖ్యాతులు తగ్గడం, విదేశీయానానికి ఆటంకాలు ఏర్పడడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే, శుభ గ్రహాల ప్రభావం వల్ల అధికారుల ఆదరాభిమానాలు పెరగడం, విదేశాల్లో మంచి ఉద్యోగం లభించడం, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశికి అష్టమంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల కష్టార్జితంలో సగానికి సగం ఏదో విధంగా వృథా కావడం, ఏ ప్రయత్నమూ నెరవేరకపోవడం, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కల గడం, రావలసిన డబ్బు రాకపోవడం, అనారోగ్యాలతో ఇబ్బందులు పడడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే, రాహువులో మార్పు వల్ల ఈ అవయోగాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల వైవాహిక జీవితంలో కలతలు, కలహాలు తలెత్తే అవకాశం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత ఉంటుంది. మోసం చేసేవారు చుట్టూ ఉంటారు. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంది. ప్రస్తుతం రాహువు శుభ గ్రహంగా మారినందువల్ల ఈ పరిస్థితులు మారడంతో పాటు, అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ప్రతి పనీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు సంచారం వల్ల సుఖ సంతోషాలు, ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. శుభ కార్యాలు పెండింగ్ లో పడతాయి. ఆస్తి వివాదాలు బాగా ముదిరిపోతాయి. పదోన్న తులకు ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబంలో టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. రాహువు శుభ గ్రహాలతో యుతి చెందడం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అయి, జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
  6. మీనం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిభా పాటవాలకు గ్రహణం పట్టినట్టవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో వైఫల్యాలు ఎదురవు తుంటాయి. వైవాహిక జీవితంలో అపార్థాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఎంత శ్రమపడ్డా ఆదాయం పెరగని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం రాహువు శుభ గ్రహంగా మారినందువల్ల శుభ యోగాలనివ్వడం, ఆదాయాన్ని పెంచడం, మంచి పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి.