Rahu Transit 2024: త్వరలో కుంభ రాశిలోకి అడుగు పెట్టనున్న రాహువు.. ఈ మూడు రాశుల వ్యాపారస్తులకు డబ్బే డబ్బు..

|

Aug 09, 2024 | 7:42 AM

రాహువు గత ఏడాది గురువు అధిపతి అయిన మీన రాశిలోకి ప్రవేశించింది. ఇక వచ్చే ఏడాది కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అలా 2026 సంవత్సరం వరకు కుంభ రాశిలో సంచరించనున్నాడు రాహువు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన చూపించనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వారికి అపార లాభాలు పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Rahu Transit 2024: త్వరలో కుంభ రాశిలోకి అడుగు పెట్టనున్న రాహువు.. ఈ మూడు రాశుల వ్యాపారస్తులకు డబ్బే డబ్బు..
Rahu Transit 2024
Follow us on

నవ గ్రహాల్లో రాహువు ఛాయా గ్రహం.. చెడు కలిగించే గ్రహంగా భావిస్తారు. ఈ రాహువు ఏ రాశిలోకి సంచారం చేసినా ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. కొందరి రాహు సంచారం శుభాన్ని కలిగిస్తే మరికొందరికి అష్టకష్టాలు కలిగిస్తుంది. అలాగే ఈ గ్రహం అపసవ్య మార్గంలో అంటే ముందు నుంచి వెనక్కి సంచరిస్తుంది. అంటే మేష రాశి తర్వాత మీనరాశిలోకి ప్రవేశించడం ఇలా వెనక్కి నడుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ గ్రహం గత ఏడాది గురువు అధిపతి అయిన మీన రాశిలోకి ప్రవేశించింది. ఇక వచ్చే ఏడాది కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అలా 2026 సంవత్సరం వరకు కుంభ రాశిలో సంచరించనున్నాడు రాహువు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన చూపించనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వారికి అపార లాభాలు పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: శనీశ్వరుడు అధిపతి అయిన కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయడం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అన్నింటా శుభప్రదంగా సాగనుంది. అంతేకాదు వ్యాపారస్తులకు సమస్యలు పరిష్కారం అయి లాభాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులకు శుభ తరుణం అని చెప్పవచ్చు. అంతేకాదు పెట్టుబడుల నుంచి భారీ మొత్తం ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్టూడెంట్స్ కు ఈ సమాయం శుభ సమయం… ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి: రాశికి వారికీ రాహు రాకతో అపార మేలు జరుగుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఏర్పడిన అడ్డంకులు తొలగి పోతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు అన్నీ పూర్తి చేస్తారు. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటె అవి పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా కూడా ఉంటారు. మొత్తానికి ఓ ఏడాది పాటు పట్టిందల్లా బంగారమే ఈ రాశికి చెందిన వ్యక్తులకు

ఇవి కూడా చదవండి

మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా రాహువు సంచరిస్తూ కుంభ రాశిలోకి ప్రవేశించడం మంచి చేస్తుంది. ఎలాంటి పనులు మొదలు పెట్టినా సక్సెస్ అవుతారు. లాభాలు పొందుతారు. ఎటువంటి పనులు అయినా కష్టపడకుండా సులభంగా పూర్తి చేస్తారు. వ్యాపారాస్తులకు, ఉద్యోగస్తులకు కాలం కలసి వస్తుంది. శుభవార్తలు వినే ఛాన్స్‌ ఉంది. అంతేకాదు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. స్నేహితుల నుంచి మంచి సపోర్ట్ లబిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు