Rahu Gochar: మీనరాశిలో రాహువు సంచారం.. రాబోయే 18 నెలలు వారికి అనుకూల ఫలితాలు..
రాహువు శనీశ్వరుడి కంటే ప్రమాదకరమైన గ్రహం. ఈ గ్రహం మీన రాశిలోకి మారడం వల్ల తప్పకుండా కొన్ని రాశుల వారు కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాహు సంచారం దీపావళికి ముందు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అడ్డంకులు తొలగి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.
Rahu Gochar 2023: మంగళవారం (అక్టోబర్ 31న) నాడు ప్రస్తుతం మేష రాశిలో ఉన్న రాహువు మీనరాశిలోకి మారుతున్నాడు. వచ్చే 18 నెలల పాటు అంటే.. దాదాపు 2025 మే నెల 18 వరకు ఇక్కడే కొనసాగుతాడు. రాహువు శనీశ్వరుడి కంటే ప్రమాదకరమైన గ్రహం. ఈ గ్రహం మీన రాశిలోకి మారడం వల్ల తప్పకుండా కొన్ని రాశుల వారు కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాహు సంచారం దీపావళికి ముందు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అడ్డంకులు తొలగి చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. రాహువు రాశిలో వచ్చే మార్పు రాబోయే 18 నెలల పాటు అన్ని రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
మేషం: రాహు గ్రహం రాశి మార్పు మేష రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కెరీర్, వ్యాపారంలో కొన్ని అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభం: రాహువు సంచారం వృషభ రాశి వారి జీవితాలలో సానుకూల మార్పులను తీసుకొచ్చే అవకాశముంది. మీ పనుల్లో ఇప్పటి వరకు వస్తున్న అడ్డంకులు తొలగిపోవచ్చు. మీకు అకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశముంది. పూర్వీకుల ఆస్తి పరంగా ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో మీ కెరీర్‌లో కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. గతంలో ఇతరులకు ఇచ్చిన అప్పులు చేతికందే అవకాశముంది.
మిథునం: రాశి మారుతున్న రాహు గ్రహం కారణంగా.. వృత్తి, ఉద్యోగాల్లో మీకు బాధ్యతలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పనిచేసే ప్రదేశంలో మంచి వాతావరణాన్ని పొందుతారు. కెరీర్‌కు సంబంధించి మీరు ఆశిస్తున్న ఆఫర్‌ను పొందవచ్చు. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు మునుపటి కంటే మెరుగైన స్థితిలో ఉంటారు.
కర్కాటకం: రాహువు రాశి మార్పుతో కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో చాలా మంచి ఆఫర్లు అందుతాయి. మీలో ధైర్యసాహసాలు పెరుగుతాయి. వ్యాపారంలో విజయం రూపంలో మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. గతంలో మీరు ఇచ్చిన రుణాలు తిరిగి మీ చేతికి అందుతాయి. ప్రతి విషయంలో ఉన్నతాధికారుల నుండి మీరు మద్దతు పొందుతారు.
సింహం: మీన రాశిలోకి రాహు గ్రహ సంచారం అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశముంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి రావచ్చు. అదృష్టం మీద ఆధారపడకండి. విజయం కోసం మీ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మీ తండ్రితో మీ సంబంధం దెబ్బతినకుండా జాగ్రత్తపడండి. మీ తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
కన్య: మీ ఆదాయం మునుపటి కంటే పెరుగుతుంది. మీరు ఆకస్మిక ధన లాభాలను పొందవచ్చు. వ్యాపారంలో ఊహించని లాభాలను ఆశించవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు పొందుతారు. ఉద్యోగం ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీరు విజయం పొందుతారు.
తుల: రాహువు రాశి మార్పు మీ జీవితంలో చాలా ఒడిదుడుకులను తీసుకొచ్చే అవకాశముంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా కుటుంబంలో సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో అనవసర వాదోపవాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. మీ పనిపై దృష్టి పెట్టండి.
వృశ్చికం: రాహు గ్రహ రాశి మార్పు వృశ్చిక రాశి వారి జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముంది. ఆర్థిక విషయాలలో పెద్ద నష్టం జరగవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ సమయంలో, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా ఏదైనా డీల్‌పై పని చేయకపోవడమే మంచిది. కొత్త ప్రాజెక్టులు చేపడితే వాటిలో మీరు నష్టపోవచ్చు. మీ వ్యాపార భాగస్వామితో గొడవలు ఏర్పడే అవకాశముంది జాగ్రత్త. ఏదైనా సమస్యపై మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే మంచిది.
ధనుస్సు: రాహు గ్రహం రాశి మార్పు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కెరీర్‌లో కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. ప్రేమ వ్యవహారాల పరంగా ఇది మంచి సమయం. మీరు ప్రేమ వివాహం గురించి ఆలోచిస్తుంటే, ముందడుగు వేసేందుకు ఇది మంచి సమయం. కడుపు సంబంధిత సమస్యల వల్ల మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతను కాపాడుకోవడంలో ఇబ్బందిపడతారు. మీ కుటుంబం వాతావరణంలో కొంద ఉద్రిక్తత నెలకొనే అవకాశముంది.
మకరం: రాహు గ్రహ సంచారం మీ మనస్సులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా మీరు మీ కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో రిస్క్ తీసుకుని ముందుకు సాగితే లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభం: కార్యాలయంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. చాలా అశుభ ప్రభావాలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కార్యాలయంలో మీకు పనిభారం పెరిగే అవకాశముంది. ఆఫీసులో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నే అవకాశముంది. ఆర్థిక విషయాలలో మీలో చురుకుదనం పెరుగుతుంది. డబ్బు సంపాదించాలనే కోరిక మీలో పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని సమస్యలు, వివాదాలు పెరగవచ్చు జాగ్రత్త.
మీనం: రాహు సంచారం మీకు మంచిది కాదు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. మీ జీవితంలో సమస్యలు పెరిగే అవకాశముంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. మీ మాటలతో కుటుంబ సభ్యులు గాయపడే అవకాశముంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక కారణాలతో వ్యాపారుల మనోబలం తగ్గే అవకాశముంది. మీన రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.