Budha Gochar 2023: వృశ్చిక రాశిలో బుధ గ్రహ సంచారం.. వారికి ఆకస్మిక ధన లాభ అవకాశం..
Budha Gochar 2023: తెలివితేటలకు, ప్రతిభా పాటవాలకు, సమయ స్ఫూర్తికి సంబంధించిన బుద్ధి కారక గ్రహం బుధుడు. వృశ్చిక రాశి వంటి రహస్య లేదా గుంభన స్థానంలో ఈ గ్రహం సంచారం చేయడం వల్ల బుధుడు ఎక్కువగా రహస్య విషయాలు, వ్యక్తిగత సమస్యల మీద కూడా దృష్టి సారిస్తాడు.నవంబర్ 7వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించబోతున్న బుధ గ్రహం సహజంగానే కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను, కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు.

Mercury Transit 2023: నవంబర్ 7వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించబోతున్న బుధ గ్రహం సహజంగానే కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను, కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. నవంబర్ 27 వరకు వృశ్చిక రాశిలో కొనసాగబోతున్న బుధుడు సాధారణంగా టెక్నికల్, టెక్నలాజికల్, మెడిసిన్, బోధన, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఫినాన్స్, రియల్ ఎస్టేట్, లీగల్ వంటి రంగాలకు కారకుడు. తెలివితేటలకు, ప్రతిభా పాటవాలకు, సమయ స్ఫూర్తికి సంబంధించిన బుద్ధి కారక గ్రహం బుధుడు. వృశ్చిక రాశి వంటి రహస్య లేదా గుంభన స్థానంలో ఈ గ్రహం సంచారం చేయడం వల్ల బుధుడు ఎక్కువగా రహస్య విషయాలు, వ్యక్తిగత సమస్యల మీద కూడా దృష్టి సారిస్తాడు. బుధుడు ఏయే రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఇవ్వబోతున్నాడో పరిశీలిద్దాం.
మేషం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో ఉన్న బుధుడు వ్యక్తిగత సమస్యలకు, కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు కానీ, వృత్తి, ఉద్యోగాలలో మాత్రం మాట చెల్లుబాటు అయ్యేటట్టు, ప్రాభవం పెరిగేటట్టు చేయడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా కొనసాగేందుకే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెద్దగా శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. తన తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడినంతగా తనకు ఉపయోగపడకపో వచ్చు.
వృషభం: ఈ రాశివారికి బుధుడు సప్తమ రాశిలో సంచారం చేయడం వల్ల సమయస్ఫూర్తితో ఎటువంటి వ్యవహారాన్నయినా చక్కబెట్టడం, ఎటువంటి సమస్యనైనా పరిష్కరిండం జరుగుతుంది. సతీ మణికి మంచి అదృష్టం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీది పైచేయి అవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు ప్రయోజనం కలిగిస్తాయి. అనవసర పరిచయాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవుతారు.
మిథునం: ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో ప్రవేశించడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏరికోరి సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. నోటి తొందర వల్ల పేరు చెడగొట్టుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకుని, ఆర్థిక సమస్యలను ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, రహస్య ఒప్పందాలకు దూరంగా ఉండాలి.
కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తెలివితేటలు, ప్రతిభా పాట వాలు బాగా ప్రకాశిస్తాయి. సామాజికంగా కూడా ఒక మేధావిగా మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల్లోనే కాక, పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధిస్తారు. ఎటువంటి ప్రయత్నమైనా, ఎటువంటి నిర్ణయమైనా సత్ఫలితాలనిస్తుంది. తోబుట్టువులతో ఆశించిన సఖ్యత ఏర్పడుతుంది.
సింహం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో బుధుడి సంచారం వల్ల కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం, కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించడం వంటివి జరుగుతాయి. బంధు మిత్రు లకు మీ సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడడం, తల్లితో సఖ్యత పెరగడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య: ఈ రాశి నాథుడైన బుధుడు తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల, సోదరులతో వివా దాలు తలెత్తడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందికర పరిస్థితుల ఏర్పడతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలున్నాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది.
తుల: ఈ రాశికి ధన స్థానంలో బుధ ప్రవేశం వల్ల, అనేక మార్గాల్లో ఆదాయ మార్గాలు పెరగడం, ఆర్థిక స్థిరత్వం లభించడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే, పెట్టుబడులు పెంచే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు చదువుల్లో ఉత్తమ ఫలితాలు అందుతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరు స్తాయి.
వృశ్చికం: ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల, కొన్ని వ్యక్తిగత వివాదాలు, సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టు వదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తారు. కీలక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యర్థులు, పోటీదార్ల మీద ఎదురు దాడి ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఆరోగ్య సమస్యల పట్ల జాగ్ర త్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం కూడా కాస్తంత ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు.
ధనుస్సు: ఈ రాశివారికి వ్యయ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అంతశ్శత్రువుల సంఖ్య పెరుగుతుంది. సహచరుల కుట్రలు, కుయుక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. కొందరు బంధుమిత్రులు అపనిందలు వేసే అవకాశం ఉంది. సతీమణికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
మకరం: ఈ రాశికి లాభ స్థానంలో బుధుడు వంటి శుభ గ్రహం ప్రవేశించడం వల్ల తప్పకుండా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహా రాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభా పాట వాలు బాగా రాణిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. పరిస్థితులు ఆశాజనకంగా మారుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభి స్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా, సామరస్యంగా సాగి పోతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, టెన్షన్లు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ గ్రహ ప్రవేశం వల్ల సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన పురోగతి అభిస్తుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారికి గృహ, వాహన యోగాలు పట్టవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశిం చిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. శుభవార్తలు వింటారు.
(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి