AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీన రాశిలో గ్రహాల సందడి.. ఈ నెలంతా వారికి అదృష్టమే అదృష్టం..!

Lucky Zodiac Signs: ఏప్రిల్ 3 నుంచి 30 వరకు మీన రాశిలో గ్రహాల సంచారం ఎక్కువగా ఉండడంతో వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి బిజీ జీవితం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇచ్చి, అదృష్టాన్ని కలిగించే అవకాశముంది.

మీన రాశిలో గ్రహాల సందడి.. ఈ నెలంతా వారికి అదృష్టమే అదృష్టం..!
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2026 | 5:31 PM

Share

ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకూ మీన రాశిలో గ్రహాల సందడి ఎక్కువగా ఉంటోంది. నెలంతా కనీసం మూడు గ్రహాలకు తక్కువగా ఈ రాశిలో సంచారం చేసే అవకాశం కనిపించడం లేదు. శని, కుజ, రవులు లేదా శని, కుజ, బుధులు ఈ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఫలితంగా మీన రాశి అనుకూలంగా ఉన్న వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి అనేక విధాలుగా యాక్టివిటీ పెరగబోతోంది. ఏదో ఒక ప్రయత్నంతో, ఏదో ఒక కార్య క్రమంతో వీరు బిజీ అయిపోయే అవకాశం ఉంది. వీరి బిజీ జీవితం సానుకూల ఫలితాలనిస్తుంది. అదృష్టాలు కలుగజేస్తుంది.

  1. వృషభం: ఈ రాశికి ఈ నెలలో లాభ స్థానంలో శని, రవి, కుజ, బుధ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగంతో పాటు రాజయోగం కూడా పట్టింది. ఎక్కడ ఏ రంగంలో ఉన్నప్పటికీ యాక్టివిటీ, బాధ్యతలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బాగా ప్రాధాన్యం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి, అధికారానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతాయి.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఈ మాసమంతా ఏదో ఒక విధంగా మూడు గ్రహాలు సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలనిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహ సంచారం బాగా పెరగడం అనేక విధాలైన అదృష్టాలకు అవకాశం కలిగిస్తుంది. రాశ్యధిపతి చంద్రుడికి కూడా బలం పెరగడం వల్ల ఈ నెలంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో అధిక సంఖ్యలో గ్రహాల సంచారం వల్ల పని హడావిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం, అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగించడం, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం, ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వగైరాల వల్ల తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వీరికి మహా భాగ్య యోగం కలిగింది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ మాసమంతా మూడు గ్రహాల సంచారం విడవకుండా జరుగుతున్నందువల్ల ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఏ రంగంలో ఉన్నా ధన యోగాలు పట్టడానికి అవకాశముంది. ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాలు లభిస్తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా వృద్ధి చెందుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు.
  6. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో మూడు గ్రహాల యుతి కొనసాగుతున్నందువల్ల అనేక విధాలుగా ఆదా యం పెరిగే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని దోషం కూడా చాలావరకు తగ్గి, ఈ నెలంతా జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఎటువంటి ఆదాయ వృద్ధి ప్రయత్నమైనా ఆశించిన విజయం సాధిస్తుంది. ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ మెరుగుపడుతుంది. ఈ రాశివారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. భోగభాగ్యాలతో, విలాసాలతో గడిచిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

Follow Us